/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/siima-jpg.webp)
SIIMA 2023: సైమా(South Indian International Movie Awards) సంబరాలు త్వరలో మొదలవనున్నాయి. సైమా అవార్డుల వేడుక ఈనెల 15, 16 తేదీల్లో దుబాయ్(Dubai)లో అట్టహిసంగా జరపనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్(Hyderabad)లో హీరో రానా దగ్గుబాటి(Hero Rana Daggubati), హీరోయిన్లు నిధి అగర్వాల్(Heroine Nidhhi Agerwal), మీనాక్షి చౌదరి(Heroine Meenakshi Chaudhary), సైమా ఛైర్ పర్సన్ బృందా ప్రసాద్, శశాంక్ శ్రీ వాస్తవ్ వెల్లడించారు. సైమా సెలబ్రేషన్స్ ప్రతి ఇయర్ ధూం ధాంగా జరుగుతుంది . అయితే ఈసారి ప్రేక్షకులను ఏ రేంజ్లో ఎంటర్టైన్మెంట్ చేస్తోందో చూడాలి. పలువురు నటీనటులు ఆడియెన్స్‌ను ఆటపాటలతో అలరించనున్నారు. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల(Sreeleela), సీతారామం ఫేమ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) సైమా వేదికపై స్టెప్పులేసేందుకు రెడీ అవుతున్నారు.
"సైమా అంటే సౌత్ ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్నీ కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ. ఈ వేడుకతో నాది 11 ఏళ్ల బంధం. గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌కి చేరుకోవడానికి ఇదొక గొప్ప వేదిక. ఇందులో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రతీసారి కొత్తగా మొదలుపెట్టిన ఉత్సాహం, ఆనందం కలుగుతోంది. అవార్డులు ఎవరికి వస్తే బాగుంటుందనే అంశం కంటే.. నటీనటులు ఎంత ఎక్కువ మంది ఈ వేడుకలో పాల్గొంటే అంత బాగుంటుందనేది నా అభిప్రాయం, దుబాయ్‌లో కలుద్దాం" అన్నారు రానా. దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నప్పటి నుంచీ 'సైమా' సంబరాల్లో పాల్గొంటున్నట్లు హీరోయిన్ నిధి అగర్వాల్ అన్నారు. గొప్ప నటులతో కలిసి వేదిక పంచుకోవడం ఆనందాన్నిస్తుందని ఆమె తెలిపారు. అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ కలిసి ఎంతో గొప్పగా జరుపుకునే సైమా వేడుకకోసం తాను ఎదురుచూస్తున్నట్లు హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలిపింది. సైమా (SIIMA) సంబరాలకు కౌంట్ డౌన్ మొదలయిందనీ సైమా ఛైర్ పర్సన్ బృందా ప్రసాద్ చెప్పారు.
Also Read: మాల్దీవుల్లో మిల్కీ అందాలు!
ఈ క్రమంలోనే హీరో రానా కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నేషనల్ అవార్డ్స్ (National Awards)పై స్పందించారు. సినిమాల విషయంలో అందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండవని.. అలా ఉండాలని రూల్ ఏమీ లేదని అన్నారు. అందరికీ ఓ జానర్ సినిమా నచ్చితే తనకు మరొక సినిమా నచ్చవచ్చని తెలిపారు. నటుల అభిరుచులు కూడా అలానే ఉంటాయి. ‘జైభీమ్’ సినిమా కథకు జాతీయ అవార్డు వస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ సినిమాకు అవార్డు రాలేదు. దానిపై ఎవరి అభిప్రాయం వారు తెలిపారు. అంతే కానీ కాంట్రవర్సీ చేయాలని కాదని చెప్పారు. వాళ్లు కేవలం ట్వీట్ మాత్రమే చేశారని..కానీ కొందరు దాన్ని కాంట్రవర్సీగా మార్చారని అన్నారు. మా ఆర్టిస్టుల మధ్య ఎలాంటి వివాదాలు ఉండవని రానా పేర్కొన్నారు.
Get ready to be spellbound. Get your tickets now to witness @AthulyaOfficial 's mesmerizing performance live at SIIMA 2023, Dubai.
Book your ticket now at #PlatinumListhttps://t.co/lMpXLWUOap
Venue: Dubai World Trade Center
Dates: 15th & 16th September 2023
.
.
.#NEXASIIMA… pic.twitter.com/CqxeZv0CWH— SIIMA (@siima) September 4, 2023
Catch the enchanting performance of the charismatic @sreeleela14 as she performs at SIIMA 2023, Dubai.
Book your ticket now at #PlatinumList https://t.co/lMpXLWUOap
Venue: Dubai World Trade Center
Dates: 15th & 16th September 2023
.
.
.#NEXASIIMA #DanubeProperties #A23Rummy… pic.twitter.com/OINDUFk2Us— SIIMA (@siima) September 3, 2023
Mark your calendars until #MrunalThakur steals the spotlight at SIIMA 2023, Dubai.
Book your ticket now at #PlatinumList https://t.co/lMpXLWUOap
Venue: Dubai World Trade Center
Dates: 15th & 16th September 2023
.
.
.#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis… pic.twitter.com/RXGeXE8Zom— SIIMA (@siima) September 2, 2023
Also Read: ఉదయ్‌నిధి సనాతన ధర్మం వ్యాఖ్యలపై రామ్‌చరణ్ ట్వీట్ వైరల్