620 Special Trains for Dussehra: రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా (Dussehra) వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా దసరాను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో రోడ్లు, రైల్వే స్టేషన్లు , బస్టాండ్లు సొంతూర్లకు వెళ్లే వారితో రద్దీగా మారాయి.
ఎక్కువ దూరం ప్రయాణించాలి అనుకునే వారు ఎక్కువగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే పండుగ రద్దీ దృష్టి రిజర్వేషన్ సీట్లు దొరకడం చాలా కష్టం. అందుకే సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దసరా రద్దీ దృష్ట్యా 620 స్పెషల్ ట్రైన్లు (620 Special Trains) నడపాలని డిసైండ్ అయ్యింది.
ఈ రైళ్లు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఈ స్పెషల్ ట్రైన్లు నడపనున్నారు. హైదరాబాద్ (Hyderabad) లోని సికింద్రాబాద్, కాచిగూడ, లింగపల్లితో సహా ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు.
Also read: సింహ వాహనం పై భక్తులకు దర్శనం ఇచ్చిన స్వామి వారు!
దసరా పండుగ నేపథ్యంలో ఏపీలోని విజయవాడ, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, తిరుపతి, రాజమండ్రి తో పాటు వివిధ ప్రాంతాలకు ప్రయాణీకులు ఎక్కువగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీ తెలంగాణల మధ్య దాదాపు 200 ట్రిప్పులు షెడ్యూల్ చేశారు.
అంతేకాకుండా షిర్డీ, జైపూర్, రామేశ్వరంతో పాటు ఇతర ప్రధాన నగరాలకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇప్పటికే పండుగ సీజన్ ను పురస్కారించుకుని కాచిగూడ- కాకినాడ టౌన్ మధ్య స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది సౌత్ సెంట్రల్ రైల్వే.
అక్టోబర్ 19 నుంచి 26 వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే అక్టోబర్ 20 నుంచి 29 మధ్య కాకినాడ నుంచి కాచిగూడకు స్పెషల్ ట్రైన్లు నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ప్రత్యేక ట్రైన్లు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఇరు మార్గాలలో ఆగుతాయని వెల్లడించారు.
Also read: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త..భారీగా తగ్గిన ధరలు!