Winter Soups: చలిగా అనిపిస్తే వేడి వేడిగా ఈ సూప్స్ ట్రై చేయండి.. సూపర్ గా ఉంటాయి..!

చలికాలంలో వెదర్ కూల్ గా ఉండడం సహజం. వెదర్ చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఏదైనా తినాలని లేదా తాగాలనిపిస్తుంది. అప్పుడు ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసిన బ్రోకలీ, టమాటో, మష్రూమ్, బేబీ కార్న్ సూప్స్ వేడిగా తాగితే శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి.

New Update
Winter Soups: చలిగా అనిపిస్తే వేడి వేడిగా ఈ సూప్స్ ట్రై చేయండి.. సూపర్ గా ఉంటాయి..!

Winter Soups: చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వేడి వేడిగా ఏదైనా స్నాక్స్ చేసుకొని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. చల్లటి వెదర్ లో వేడి వేడిగా ఏదైనా తినడం ఒక ఫ్యాన్టసీ లా ఫీల్ అవుతారు కొంతమంది. కొందరు స్నాక్స్ ఇంట్లోనే చేసుకొని తింటారు. మరికొందరు శ్రమ లేకుండా బయట నుంచి ఆర్డర్ చేసుకొని మరీ తింటారు. ఇంట్లో ఏవైనా స్నాక్స్ చేసుకోవడానికి శ్రమ అని ఫీల్ అయ్యే వారు వేడి వేడిగా ఈ సింపుల్ సూప్స్ ట్రై చేయండి.

శరీరం వెచ్చగా ఉండడానికి వేడి వేడిగా ఈ సింపుల్ సూప్స్ ట్రై చేయండి

ముల్లంగి సూప్

ముల్లంగి సూప్ రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యమైనది కూడా. ఆనియన్స్, ముల్లంగి, ఆకు కూరలతో తయారు చేసిన సూప్ శరీరానికి కావాల్సిన పోషకాలతో పాటు రుచిగా కూడా ఉంటుంది. చలిగా ఉన్నప్పుడు దీనిని తాగితే వెచ్చగా ఉంటుంది.

publive-image

టమాటో సూప్

చలికాలంలో టమాటో సూప్ బెస్ట్ ఆప్షన్. దీనిని చేసుకోవడం కూడా చాలా ఈజీ. టమాటోస్ తో పాటు క్యారెట్స్ కూడా వేస్తే పోషక విలువలు కూడా పెరుగుతాయి. సూప్ చేశాక దానిని తులసి ఆకులతో గార్నిష్ చేసి తాగితే.. కూల్ వెదర్ లో అద్భుతంగా ఉంటుంది.

publive-image

బేబీ కార్న్ సూప్

వెదర్ కూల్ గా ఉన్నప్పుడు ఈ సూప్ చాలా బాగా ఉపయోగపడును. క్యాప్సికం, బేబీ కార్న్, క్యాబేజీ ఇంగ్రీడియంట్స్ తో చేసిన ఈ సూప్ చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడును.

publive-image

మష్రూమ్ సూప్

మష్రూమ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. గార్లిక్, పెప్పర్ ఫ్లేవర్స్ యాడ్ చేసి వేడి వేడిగా తాగితే ఆరోగ్యానికి ఎన్నో రకాల లాభాలతో పాటు రుచిగా కూడా ఉంటుంది. వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఈ సూప్ తాగితే శరీరానికి కాస్త వెచ్చదనాన్ని ఇస్తుంది.

publive-image

బ్రోకలీ సూప్

ఆకు కూరలు, కూరగాయలతో తయారు చేసిన ఈ సూప్ లో పుష్కలమైన పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుచును. సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకునే ఈ సూప్ చలిగా అనిపిస్తే వేడి వేడిగా దీనిని తాగితే రుచితో పాటు వెచ్చగా అనిపిస్తుంది.

publive-image

Also Read: Ways to Accept Failure: ఓటమి నేర్పే పాఠాలు ఇవే.. ఈ విషయాలు తెలుసుకుంటే మీకు తిరుగేఉండదు బాసూ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు