Sony Bravia 8 OLED Smart TV: సోనీ బ్రేవియా 8 ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీ సిరీస్ తాజగా భారత మార్కెట్‌లో లాంచ్ అయ్యింది. 65 అంగుళాలు, 55 అంగుళాల స్క్రీన్ సైజులతో అందుబాటులో ఉన్న ఈ టీవీలు, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి. వీటిలో ఆటో హెచ్‌డీఆర్ టోన్ మ్యాపింగ్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్, ఆటో లో లేటెన్సీ మోడ్ వంటి నూతన ఫీచర్లు ఉన్నాయి.
4కే రిజల్యూషన్‌తో 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అందించడం ద్వారా మరింత మెరుగైన విజువల్ అనుభవం అందిస్తాయి. హెచ్‌డీఆర్, హెచ్ఎలజీ, డాల్బీ విజన్ వంటి ముఖ్యమైన ఫీచర్లను కూడా ఈ టీవీలు కలిగి ఉన్నాయి. యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ మరియు ఇన్-బిల్ట్ క్రోమ్ కాస్ట్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
Sony Bravia 8 OLED Smart TV(సోనీ బ్రేవియా 8 ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీ) ధర:
సోనీ బ్రేవియా 8 ఓఎల్ఈడీ సిరీస్‌లో 55 అంగుళాల మోడల్ ధర రూ.2,19,990, 65 అంగుళాల వెర్షన్ ధర రూ.3,14,990. ఈ టీవీలను సోనీ సెంటర్లు, ప్రముఖ ఎలక్ట్రానిక్ స్టోర్లు, ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Sony Bravia 8 OLED Smart TV స్పెసిఫికేషన్లు, ఫీచర్లు:
ఈ సిరీస్‌లో 55 అంగుళాలు, 65 అంగుళాల స్క్రీన్ సైజులతో మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. టీవీల్లో 4కే ప్యానెల్‌తో పాటు 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. హెచ్‌డీఆర్10, డాల్బీ విజన్, హెచ్ఎలజీ ఫార్మాట్లను కూడా సపోర్ట్ చేస్తాయి.
ఏఐ ఆధారిత ఎక్స్ఆర్ ఇమేజ్ ప్రాసెసర్, 4కే అప్‌స్కేలింగ్ టెక్నాలజీని ఈ టీవీల్లో అందిస్తున్నారు, తద్వారా 2కే సిగ్నల్స్‌ను 4కే స్థాయికి పెంచవచ్చు.
ఈ టీవీ, డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్, డీటీఎస్ డిజిటల్ సరౌండ్ వంటి అధునాతన సౌండ్ ఫీచర్లను అందిస్తుంది. సోనీ అకౌస్టిక్ సర్ఫేస్ ఆడియోను కూడా ఈ మోడల్స్ అందిస్తున్నారు.
సోనీ పిక్చర్స్ మూవీస్ లైబ్రరీని అందించే సోనీ పిక్చర్స్ కోర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. యాపిల్ ఎయిర్‌ప్లే, హోమ్ కిట్‌లకు కూడా ఈ టీవీ కంపాటిబుల్.
Also Read: హైదరాబాద్ లో ఆ 56 చెరువులు మాయం.. ఎక్కడెక్కడ ఎంత మింగారంటే?
ఈ టీవీలలో నాలుగు హెచ్‌డీఎమీఐ ఇన్‌పుట్స్, రెండు యూఎస్‌బీ పోర్టులు, బిల్ట్-ఇన్ క్రోమ్ కాస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆటో హెచ్‌డీఆర్ టోన్ మ్యాపింగ్ ఫీచర్‌తో హెచ్‌డీఆర్ సెట్టింగ్స్‌ను తక్షణంగా ఆప్టిమైజ్ చేయవచ్చు.
వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తూ, ఆటో లో లేటెన్సీ మోడ్‌ను కూడా అందిస్తున్నారు. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి, గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్స్, గేమ్స్, సినిమాలు, టీవీ ఎపిసోడ్లను యూజర్‌లు సులభంగా యాక్సెస్ చేయవచ్చు. వాయిస్ కమాండ్స్‌ను కూడా రిమోట్ సపోర్ట్ చేస్తుంది.