Song: సోషల్ మీడియాకు ప్రాధాన్యత పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు తమ టాలెంట్ ను సోషల్ మీడియా వేదిక పై ప్రదర్శిస్తూ ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు టీవీల్లో, సినిమాల్లో కనిపిస్తేనే టాలెంట్ ను గుర్తిస్తారు అనుకునే పరిస్థితి ఉండేది. కానీ.. ఇప్పుడు టాలెంట్ ను ప్రదర్శించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.. ఫెస్ బుక్, ఇన్స్టాగ్రామ్, యు ట్యూబ్ ఇలా పలు సోషల్ మీడియా వేదికల ద్వారా పెద్దగా ఖర్చు లేకుండానే తమ టాలెంట్ ను ప్రదర్శిస్తూ ఎంతో మంది గుర్తింపు పొందుతూ సెలబ్రేటీలుగా మారుతున్నారు. ఎంత కష్టపడ్డా అవకాశాలు రాని అనేక మంది.. వాళ్ళ టాలెంట్ ను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకులలో ఫేమస్ అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నచాలా మందికి సినిమాల్లో కూడా అవకాశాలు లభిస్తుండడం విశేషం. రీసెంట్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సీమ దసర చిన్నోడే సాంగ్.. ఈ పాటకు నెటిజన్ల నుంచి మంచి స్పందన దక్కుతోంది. యుట్యూబ్ లో ఈ పాట చూసిన ప్రేక్షకులు చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Song: ఇంకా దుమ్ములేపుతోన్న సీమ దసర సిన్నోడు సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయో తెలుసా?
సీమ దసర సిన్నోడే.. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తుంది. ఈ పాట పై నెటిజన్లు కొన్ని వేలకు పైగా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాట యుట్యూబ్ లో 43మిలియన్ వ్యూస్ కు చేరుకుంది.
Translate this News: