Snake Bite Dream: కలలో పాములు పదేపదే కనిపిస్తున్నాయా? అసలు కారణం ఇదే..!

జీవితం కొన్నిసార్లు మనల్ని బలహీనంగా, ఓడిపోయిన అనుభూతిని కలిగిస్తుంది. కలలో పాములు రావడానికి ఇది ఒక కారణం కావొచ్చు. అంతర్గత సంఘర్షణలు, భావోద్వేగాలు, భయాలు మనలో దాగి ఉన్నాయని చెప్పేందుకు పాము కలలు రావొచ్చు. అసలు భయపడాల్సిన అవసరంలేదు. ప్రలోభాలకు గురవుకుండా ఉండడండి.

New Update
Snake Bite Dream: కలలో పాములు పదేపదే కనిపిస్తున్నాయా? అసలు కారణం ఇదే..!

Snake dreams: కొన్ని కలలు భయానకంగా ఉంటాయి. గాఢ నిద్ర(Deep sleep)లో ఉన్న మనల్ని ఉలిక్కిపడేలా చేస్తాయి. ముఖ్యంగా పాములు కలలోకి వస్తే చాలా భయం వేస్తుంది. ఆ కల తర్వాత మన కాలికి, చేతికి లేదా శరీరంలో ఎక్కడ ఏం తగిలినా పాము మన దగ్గరికి వచ్చిందేమోనన్న ఫీలింగ్‌ కలుగుతుంది. చాలా మందికి పాము కల తర్వాత నిద్ర కూడా పట్టదు. మరికొంతమందికి అదే పాము కల చాలా రోజులు గుర్తిండి వెంటాడుతోంది. ఇంకొందరికి పాము కలలు పదేపదే వస్తుంటాయి. ఇలా పాములు కలలోకి రావడానికి వివిధ అర్థాలు ఉన్నాయట..!

సానుకూల అర్థాలు:

➼ మీరు విస్మరిస్తున్న సమస్య గురించి మేల్కొలుపు పిలుపు

➼ మార్పును స్వీకరించాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేయడం

➼ భయాలను అధిగమిస్తూ.. అంతర్గత శక్తిని, శక్తిని వెలికితీయడం.

➼ పెరిగిన అంతర్దృష్టి,ఆధ్యాత్మిక అవగాహన

ప్రతికూల అర్థాలు:

➼ దాచిన భయాలు, ఆందోళనలు

➼ విషపూరిత సంబంధాలు

➼ బెడ్‌ హ్యాబిట్స్‌ లేదా ప్రవర్తన

➼ ప్రలోభాలకు గురవతుండడం

➼ తప్పుడు నిర్ణయం తీసుకుంటారనే ఆందోళన

➼ అంతర్గత సంఘర్షణలు, భావోద్వేగాలు

పాములు కలలో కాటు వేస్తున్నాయా?
ఒకవేళ కలలో మీకు పాము కాటు వేస్తూంటే ఇది ఒక హెచ్చరిక. చాలా కాలంగా పట్టించుకోని లేదా పరిష్కరించని సమస్యలు లేదా భావాలకు సంకేతంగా భావించవచ్చు. అలసత్వం నుంచి బయటకు రావాలని చెబుతున్న మెసేజ్ కావొచ్చు. ఇక పాములను లేదా పాములకు సంబంధించిన సినమాలు, ఇతర దృశ్యాలు చూసి నిద్రపోతే అవి కలలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తే అవి కలలుగా వస్తాయి.

(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఆర్టీవీ(RTV) దీనిని ధృవీకరించలేదు)

Advertisment
Advertisment
తాజా కథనాలు