నడుము నొప్పితో బాధపడుతున్నారా..అయితే ఇలా చేయండి!

ఈ మధ్యకాలంలో చాలా మంది నడుము, మెడ, వెన్నునొప్పి వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో 30ఏళ్లుదాటిన వారు కూడా ఉండటం గమనార్హం.నేటికాలంలో నడుమునొప్పి అనేది సాధారణమైంది. నడుము నొప్పికి కారణాలేన్నో ఉన్నాయి. ఎలాంటి పొజిషన్లో పడుకుంటే నడుమునొప్పి తగ్గుతుందో తెలుసుకుందాం.

నడుము నొప్పితో బాధపడుతున్నారా..అయితే ఇలా చేయండి!
New Update

శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచి నిద్ర అనేది చాలా అవసరం. వెన్నునొప్పి ఉంటే మంచి నిద్ర అసాధ్యం. రాత్రిళ్లు మెల్కొనవల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయితే మీ స్లీపింగ్ పొజిషన్ లో కొన్ని మార్పులు చేసినట్లయితే మీ నడుముపై ఒత్తిడిని తగ్గించవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

మీ ఒక్క సైడు అంటే (పక్కమీద పడుకోవడం) మీ కాళ్లను మీ ఛాతీ వైపు కొద్దిగా పైకి లాగండి. మీ కాళ్ల మధ్య ఒక దిండును ఉంచుకోండి.  మీ మోకాళ్ళను వంచడం.. మీ కాళ్ళ మధ్య ఒక దిండు ఉంచినట్లయితే..మీ వెన్నెముక, కటి, తుంటిని సమలేఖనం చేయడంలో సహాయపడుతుంది. ఈ స్థానం మీ వెన్నెముకపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు కావాలనుకుంటే పొడవు బాడీ దిండును కూడా ఉపయోగించుకోవచ్చు.

మీరు వెల్లకిలా పడుకుంటే మీ మోకాళ్ల క్రింద ఒక దిండును ఉంచండి. ఇది మీ వెనక కండరాలను రిలాక్స్ గా ఉంచుతుంది. దిగువ వీపు వక్రతను సరిగ్గా ఉంచేందుకు సహాయపడుతుంది. మీరు ఇంకా రిలాక్స్ గా పడుకోవాలనుకుంటే మీ నడుము కింద చిన్నగా చుట్టిన టవల్ ను ఉంచండి. ఒక దిండుతో మీ మెడకు సపోర్టు ఉంచండి. దిండు మీ మెడను మీ ఛాతీ, వీపుపై సమానంగా ఉంచాలి.

చాలా తక్కువ మందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. ఎందుకంటే బోర్లా పడుకుంటే మన బరువంతా పొట్టపై పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. అయితే వెన్నునొప్పితో బాధపడేవారు బోర్లా పడుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎలాగంటే మీ  బోర్లా పడుకున్నప్పుడు వెనక భాగంలో కాస్త కష్టంగా ఉంటుంది. మీ తుంటి, దిగువ పొట్ట కింద ఒక దిండును ఉంచండి. ఇది వెన్నునొప్పిని తగ్గిస్తుంది. మీ వెనక భాగంలో ఎక్కువగా ఒత్తిడి లేనట్లయితే మీ తల కింద ఒక దిండును ఉంచండి.

పొట్టను పైకి ఉంచి పడుకునేవారు చాలా అదృష్టవంతులు. అది మగవాళ్లైనా కావచ్చు..ఆడవాళ్లైనా కావచ్చు. ఎవరైనాసరే ఇలా పడుకోవడం మంచి పొజిషన్.దీని వల్ల వెన్నుముక సరిగ్గా ఉంటుంది. ఈవిధంగా పడుకుంటే మెడ వెనక భాగం దగ్గర కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది. అక్కడి కండరాలు ఇబ్బంది పడతాయి. అయినప్పటికీ ఇది చర్మానికి మేలు చేస్తుంది. ముఖంపై ముడతలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఇది చక్కటి పొజిషన్ అని చెప్పవచ్చు. ఈ పొజిషన్ వల్ల ఉన్న సమస్య ఏంటంటే గురక.

#health-care-tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe