/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/slapping-jpg.webp)
ఈ మధ్యకాలంలో చెంపలపై కొట్టేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఒకరిని చూసి మరొకరు నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు, టీచర్లుతో పాటు ఇటివలి కాలంలో రాజకీయ నాయకులు కూడా చేతివాటం చూపిస్తున్నారు.
ఇతరులపై చేయి చేసుకుంటూ రాష్ట్ర మంత్రులు తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు. తాజాగా హోంమంత్రి మహమూద్ అలీ తన గన్మెన్ చెంపపై కొట్టారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా ఆయనను హగ్ చేసుకుని విషెస్ చెప్పారు. అంతలోనే బొకే ఎక్కడ? అంటూ పక్కనే ఉన్న గన్మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకున్నారు. ఆయనను తలసాని పోనీలేండి అంటూ వారించారు. ఇలా చెంపపై కొట్టడం ఏ మాత్రం మంచిది కాదు అని సైకాలజిస్టులు సైతం చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/slappinggg-jpg.webp)
ఒకరి చెంపలపై కొట్టడం ఎందుకు కరెక్ట్ కాదు?
శారీరక గాయం: చెంపలపై కొట్టడం వల్ల దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది. దీని వల్ల బుగ్గలు వాచిపోయే ప్రమాదం కూడా ఉంది. శారీరక హాని కలుగుతుంది.
నొప్పి, అసౌకర్యం: చెంపలపై కొట్టినప్పుడు చాలా నొప్పి వస్తుంది. అది చాలాసార్లు తట్టుకోలేనిదిగా ఉంటుంది. ఇది శారీరక, మానసిక అసౌకర్యానికి దారితీస్తుంది.
ఎమోషనల్ అండ్ సైకలాజికల్ ఎఫెక్ట్స్: చెంపదెబ్బలు మానసికంగా బాధ కలిగిస్తాయి. చాలా మందిని ఇది సైకలాజికల్‌గా ఎఫెక్ట్ చేస్తుంది. చెంప దెబ్బ తినడాన్ని చాలా మంది అవమానంగా భావిస్తారు. ఇది కోపంతో పాటు భయం లాంటి భావాలకు దారి తీస్తుంది.
ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం: చెంపదెబ్బ తగిలినప్పుడు చర్మం కొన్నిసార్లు క్రాక్ వస్తుంది. బ్యాక్టీరియా గాయంలోకి ప్రవేశిస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
సామాజిక, చట్టపరమైన పరిణామాలు: చాలా చోట్ల, ఒకరిని చెంపదెబ్బ కొట్టడం, దాడి ఆరోపణలు లాంటివి చట్టపరమైన పరిణామాలకు దారి తీస్తుంది.
అహింసా మార్గాల్లో భావోద్వేగాలను వ్యక్తపరచడం ముఖ్యం. కారణం ఏదైనా కావొచ్చు.. దెబ్బకొట్టడం, దాడి చేయడం, తన్నడం లాంటివి అసలు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎవరూ కూడా ఫిజికల్ అటాక్స్‌కి మారిపోరు. అందుకే చెంపదెబ్బలు కొట్టడం లాంటివి చేయకూడదు. ముఖ్యంగా కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను చెంపలపై కొడుతుంటారు. అటు టీచర్లు సైతం ఇలానే చేస్తుంటారు. ఇది అసలు కరెక్ట్ పద్ధితి కాదు. చెంపలపై కొట్టడం అనేక ప్రమాదాలను కొని తెస్తుంది.
ALSO READ: సెలబ్రిటీలు ఫాలో అయ్యే బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. ఒకసారి ట్రై చేసి చూడండి!