/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-10T192139.672-jpg.webp)
Winter Skin Care: వింటర్ సీజన్స్ లో అందరు ఎక్కువగా ఎదుర్కునే సవాలు చర్మ సమస్య. వాతావరణంలోని మార్పుల వల్ల చర్మం పొడి బారడం, పగుళ్లు, పేలి పోయినట్లు కనిపిస్తుంది. వెదర్ చల్లగా ఉండడం వల్ల నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోరు ఇది పరోక్షంగా చర్మ సమస్యకు దారి తీయును. చర్మం డీ హైడ్రేట్ అవ్వడం వల్ల నీరసంగా, పొడి బారినట్లు, చికాకుగా కనిపిస్తుంది. చలికాలంలో ఇలాంటి సమస్యల నుంచి రిలీఫ్ పొందడానికి ఈ సింపుల్ టిప్స్ పాటించండి.
చర్మాన్ని తేమగా ఉంచండి
చలికాలంలో అందరు ఎక్కువగా ఎదుర్కునే చర్మ సమస్యల్లో ముఖ్యమైనది డీ హైడ్రేషన్. డీ హైడ్రేషన్ కారణంగా చర్మం పొడి బారడం, పగుళ్లు రావడం జరుగుతుంది. చలికాలంలో వాతావరణంలోని మార్పులు చర్మంలోని తేమను తొలగిస్తాయి. అందుకని చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచడానికి మాషూరైజింగ్ క్రీమ్, ఆయిల్ బేస్డ్ మాశ్చురైజర్ అప్ప్లై చేసుకోవాలి. ఇవి చర్మంలోని తేమను లాక్ చేసి డీ హైడ్రేషన్ సమస్యను దూరంగా ఉంచును.
రోజూ క్లెన్జర్ వాడండి
చర్మాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకని కెమికల్స్ ఎక్కువగా ఉన్న క్లెన్జర్స్ వాడితే అవి చర్మంలోని నేచురల్ ఆయిల్స్ తొలగించే ప్రమాదం ఉంటుంది. చలికాలంలో చర్మం పొడి బారినట్లు, చికాకును తొలగించడానికి హైలురానిక్ యాసిడ్, గ్లిసరిన్ వంటి పదార్థాలతో తయారు చేసిన క్లెన్జర్ వాడితే మంచిది. ఇవి చర్మం పై దుమ్ము, ధూళిని తొలగించి శుభ్రంగా ఉంచుతాయి.
సరైన నీళ్లు, ఆహరం తీసుకోవాలి
సరైన నీళ్లు, ఆహరం చర్మ సౌందర్యానికి చాలా ముఖ్యం. చాలా మంచి చలికాలంలో నీళ్లు తక్కువగా తీసుకుంటారు దాని వాళ్ళ శరీరంతో పాటు మొహం కూడా డీ హైడ్రేట్ అవుతుంది. చర్మం తేమగా, మృదువుగా ఉండడానికి నీళ్లు బాగా తీసుకోవాలి. అంతే కాదు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి అవి చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి సహాయపడును.
మంచి సన్ స్క్రీన్ అప్లై చేయండి
చాలా మంది సన్ స్క్రీన్ కేవలం సమ్మర్ లో మాత్రమే చర్మాన్ని UV రేస్ నుంచి రక్షించడానికి వాడుతుంటారు. కానీ చలికాలంలో కూడా ఇది చాలా అవసరం. మంచు నుంచి కూడా ఇలాంటి కిరణాలే వస్తాయి. ఇవి చర్మం పై ప్రభావం చూపుతాయి. అందుకని చలికాలంలో కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి.
స్కిన్ కేర్ రొటీన్
చర్మ ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని రక్షించడానికి స్కిన్ కేర్ రొటీన్ చాలా ముఖ్యం. ప్రతీ రోజూ రాత్రి పడుకునే ముందు మీ చర్మానికి సూట్ అయ్యే హైడ్రేటింగ్ సీరమ్స్, విటమిన్ E మాశ్చురైజర్ అప్లై చేసి పడుకుంటే చర్మం పై మంచి ప్రభావం చూపును. ఇవి స్కిన్ లోని డెడ్ సెల్స్, డ్యామేజ్డ్ సెల్స్ ను తొలగించును.