Neck Pain: ఈ మధ్య కాలం చాలా మంది మెడ నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలోసిస్. మెడ భాగంలోని మృదులాస్థి(cartilage), ఎముకలు(bones), స్నాయువులు(ligaments) అరిగిపోవడం ప్రారంభమైనప్పుడు ఇది సంభవిస్తుంది. ఒకప్పుడు ఇది వృద్ధాప్య వయసు వారిలో ఎక్కువగా కనిపించేది. కానీ ప్రస్తుత జీవనశైలి కారణంగా వయసు తో సంబంధం లేకుండా చిన్న వయసు వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది.
ఈ సమస్య చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మెడ పట్టి వేసుకోవడం వంటివి చేస్తారు. అయితే.. ఎలాంటి మందులు వాడకుండా సింపుల్ యోగా ప్రాక్టీసెస్ ఫాలో అయితే నొప్పి తగ్గుతుందని చెబుతున్నారు మాస్టర్ గౌతమ్ (ఫౌండర్ ఆఫ్ యోగ అండ్ వెల్ నెస్).
తాజాగా మాస్టర్ గౌతమ్ (ఫౌండర్ ఆఫ్ యోగ అండ్ వెల్ నెస్) ఆర్టీవికీ ఇచ్చిన ఇంటర్వ్యూ లో సర్వైకల్ స్పాండిలోసిస్ పై పూర్తి అవగాహన కల్పించారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి యోగా ప్రాక్టీసెస్ సహాయపడతాయి , వాటిని ఎలా చేయాలి అనేది తెలిపారు. మాస్టర్ గౌతమ్ చెప్పిన ఈ తొమ్మిది యోగా ప్రాక్టీసెస్ పాటిస్తే.. ఆపరేషన్ కూడా అవసరం లేదు మీ మెడ నొప్పి సింపుల్ గా తగ్గిపోతుంది. ఆ తొమ్మిది యోగా ప్రాక్టీసెస్ ఏంటో తెలుసుకోవడానికి కింది వీడియోను చూడండి.