Feet Tips: ఎండాకాలం పాదాల పగుళ్లను నివారించే సింపుల్‌ చిట్కాలు

మారుతున్న వాతావరణంలో పొడిబారడం వల్ల ముఖంపైనే కాకుండా పాదాలపైనా ప్రభావం చూపుతుంది. పగిలిన మడమలు కొన్నిసార్లు అసౌకర్యం, ఇబ్బంది కలిగిస్తాయి. పగిలిన, పొడి మడమలను కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు. ఆ చిట్కాల కోసం ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Feet Tips: ఎండాకాలం పాదాల పగుళ్లను నివారించే సింపుల్‌ చిట్కాలు

Feet Tips: పొడి చర్మం ముఖాన్నే కాదు పాదాలను కూడా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా పగిలిన మడమలు కొన్నిసార్లు అసౌకర్యం, ఇబ్బంది కలిగిస్తాయి. పగిలిన, పొడి మడమలను కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. మారుతున్న వాతావరణంలో పొడిబారడం వల్ల ముఖంపైనే కాకుండా పాదాలపైనా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మడమల పగుళ్ల సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పాదాల నుంచి డెడ్ స్కిన్ తొలగించడానికి చక్కెర లేదా ఉప్పు వంటి సహజ పదార్ధాలను కలిగి ఉన్న సహజ ఎక్స్‌ఫోలియంట్ ఫుట్ స్క్రబ్‌లు వాడాలి. ఎందుకంటే ఇవి మృతకణాలను తొలగించడంలో సమర్థంగా పనిచేస్తాయి.

publive-image

తడి పాదాలకు స్క్రబ్‌ను సున్నితంగా రుద్దాలి. కఠినమైన ప్రాంతాలు, మడమలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు అంటున్నారు. స్క్రబ్‌ తర్వాత కాళ్లను కడిగి టవల్‌తో శుభ్రంగా తుడవాలని చెబుతున్నారు. ప్యూమిస్ స్టోన్స్ వంటి ఫుట్‌ఫైల్స్ ప్రత్యేకంగా పాదాల నుంచి డెడ్‌స్కిన్‌ను తొలగిస్తాయి. అవసరమైన ఎక్స్‌ఫోలియేషన్ స్థాయిని బట్టి ముతక లేదా చక్కటి గ్రెయిన్ ఫుట్ ఫైల్‌ను ఎంచుకోవాలి. డెడ్‌ స్కిన్‌ను తొలగించుకోవడానికి పొడి లేదా తడి చర్మంపై ముందుకు వెనుకకు రుద్దాలని నిపుణులు చెబుతున్నారు. వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మృత చర్మ కణాలను కరిగించి చర్మంలో pH స్థాయిలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.

Simple tips to prevent cracked feet during summer

ఒక పాత్రలో సమాన పరిమాణంలో వెనిగర్, వెచ్చని నీటిని కలపాలి. పాదాలను 10-15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత వదులుగా ఉన్న డెడ్ స్కిన్‌ను తొలగించడానికి బ్రష్ లేదా ప్యూమిస్ స్టోన్‌తో పాదాలను సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఓట్ మీల్‌ను పొడి చేసి వేడి నీటిలో కలపాలి. అందులో పాదాలను 15-20 నిమిషాలు నానబెట్టి ఆపై డెడ్‌స్కిన్‌పై స్క్రబ్‌ చేయాలి. కొబ్బరి నూనె ఒక సహజ మాయిశ్చరైజర్. ఇది పాదాలపై పొడి, చనిపోయిన చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అంతేకాకుండా హైడ్రేట్ చేస్తుంది. పాదాలను శుభ్రం చేయడానికి కొబ్బరి నూనెను అప్లై చేసి వృత్తాకారంగా మసాజ్‌ చేయాలి. మంచి ఫలితాల కోసం రాత్రి పూట నూనె రాసి అలాగే ఉంచాలి. అవసరం అయితే సాక్స్‌ వేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఇలా చేస్తే ఒత్తిడి లేకుండా జీవితాన్ని ఆస్వాదించొచ్చు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు