Alovera: Alovera: పొడవైన జుట్టు కోసం.. అలోవెరా హెయిర్ ప్యాక్స్

ఈ మధ్య కాలం జుట్టు రాలడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. జుట్టు పెరుగుదలకు కలబంద చక్కగా పనిచేస్తుంది. దీనితో తయారు చేసిన హెయిర్ మాస్క్ జుట్టును పెంచడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ మాస్క్ తయారు చేసే విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Alovera: Alovera: పొడవైన జుట్టు కోసం.. అలోవెరా హెయిర్ ప్యాక్స్

Alovera:ఆడపిల్లలకు అత్యంత ఇష్టమైనది జుట్టు. జుట్టు పొడువుగా అందంగా ఉండాలని ఆశపడతారు. ఈ మధ్య కాలం చాలా మందిలో జుట్టు రాలడం ఎక్కువగా కనిపిస్తుంది. ఆహారపు అలవాట్లు, జీవన శైలి విధానాలు, పౌష్టికాహార లోపం దీనికి ఎక్కువగా కారణమవుతున్నాయి. జుట్టుకు సరైన పోషణ, జాగ్రత్తలు లేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. జుట్టు ఆరోగ్యం, పెరుగుదలకు కలబంద సరైన ఎంపిక. కలబంద హెయిర్ మాస్క్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. కలబందతో రకరకాల హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు.

కలబంద హెయిర్ ప్యాక్స్

మందారం కలబంద హెయిర్ మాస్క్

ఇది తయారు చేయడానికి అలోవెరా జెల్, మందారం ఆకులు కావాలి. ముందుగా మందారం ఆకులను మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో అలోవెరా జెల్ కలిపి కలిపి జుట్టుకు అప్లై చేయాలి. 15 పాటు బాగా నాననివ్వాలి. ఆ తర్వాత కూల్ వాటర్ తో జుట్టును శుభ్రం చేసుకోవాలి.

Also Read: Kidney Stones: కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి

publive-image

ఆముదం, మెంతి పొడి కలబంద హెయిర్ మాస్క్

సాధారణంగా ఆముదం నూనె జుట్టుకు చాలా మంచిది. దీనితో తయారు చేసే కలబంద ప్యాక్ జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఆముదం 2 టేబుల్ స్పూన్స్, మెంతి పొడి 2 టేబుల్ స్పూన్స్, అలోవెరా జెల్ 1 కప్పు . ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలో పడుకునే ముందు పెట్టుకోవాలి. రాత్రంతా దీన్ని అలాగే ఉంచాలి. ఉదయం కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూ తో హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది. ఇది నెలకు 2 లేదా మూడు సార్లు అప్లై చేస్తే జుట్టు పొడువుగా పెరుగుతుంది.

పెరుగు కలబంద హెయిర్ ప్యాక్

2 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్, 2 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకోవాలి. ఒక బౌల్ లో అలోవెరా జెల్, పెరుగు, తేనె కలిపి.. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. 15-20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత షాంపూ తో క్లీన్ చేయాలి. వారానికి ఒక సారి ఇలా చేస్తే జుట్టు మృదువుగా, హెల్తీ గా ఉంటుంది. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

Also Read: Mobile: చార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతున్నారా.. ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు