Biryani : బ్యాచిలర్స్.. ఈ రెసిపీ మీ కోసమే.. సింపుల్ గా అదిరిపోయే బిర్యానీ

సహజంగా బిర్యానీ అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది. కానీ దీని ప్రిపేర్ చేయడం మాత్రం కష్టంగా అనిపిస్తుంది. అందుకే బిర్యానీ లవర్స్ కోసం కేవలం 20నిమిషాల్లోనే అదిరిపోయే బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. పూర్తి రెసిపీ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. 

Biryani : బ్యాచిలర్స్.. ఈ రెసిపీ మీ కోసమే.. సింపుల్ గా అదిరిపోయే బిర్యానీ
New Update

Biryani Recipe : చాలా మందికి బిర్యానీ(Biryani) అనేది ఒక డిష్ కాదు. బిర్యానీ అంటే ఎమోషన్. బిర్యానీ పేరు వినగానే తెలియకుండానే నోరు ఊరిపోతుంది. కానీ అది చేయడానికి మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు మీ కోసం సింపుల్ గా కేవలం 20 నిమిషాల్లోనే బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ రెసిపీ(Recipe) బ్యాచిలర్స్(Bachelors), ఇంటికి దూరంగా ఉన్న వారికి బాగా సహాయపడుతుంది. తక్కువ టైమ్ లో టేస్టీ బిర్యానీ(Tasty Biryani) ఎంజాయ్ చేయవచ్చు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది చికెన్ కాదు ఎగ్ బిర్యానీ.

Also Read : Chicken : ఏంటీ ..! చికెన్ కడిగి వండితే ఇలా జరుగుతుందా..! జాగ్రత్త

ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు 

ఎగ్స్ -4, బాస్మతి రైస్ - 1 కప్పు, ఉల్లిపాయ- 1, టమాటో - 1,  పచ్చి మిర్చి-2, పెరుగు- 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ మసాలా- 1 టీ స్పూన్, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, ఆవాలు- 1/2 టీ స్పూన్, నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్స్, అల్లం- 1 టేబుల్ స్పూన్ , కొత్తిమీర, నిమ్మకాయ

తయారీ విధానం 

  • ముందుగా తీసుకున్న ఒక కప్పు బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాన బెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్ పై బౌల్ పెట్టుకొని గుడ్లను ఉడకబెట్టుకోవాలి. గుడ్లు ఉడికిన తర్వాత వాటిని పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక పాన్ స్టవ్ పై పెట్టుకొని దాంట్లో కాస్త నూనె లేదా నెయ్యి వేసుకొని వేడెక్కనివ్వలి. ఆ తర్వాత నూనెలో జీలకర్ర, ఆవాలు వేసి చిటపట అనేదాక ఉంచాలి.
  • నెక్స్ట్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు(Onion Pieces) వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాక వేయించాలి. తర్వాత అల్లం పేస్ట్, పచ్చి మిర్చి, టమోటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు ఉడికిన టమోటో మిశ్రమంలోకి బిర్యానీ మసాలా, కారం పొడి వేసుకొని మరో నిమిషం పాటు ఉడికంచుకోవాలి. ఆ తర్వాత దాంట్లో పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు వేసిన తర్వాత మరో 2-3 నిమిషాల కుక్ చేయాలి. కర్రీ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతున్న సమయంలో ముందుగానే ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసి వాటికి మసాలా పట్టేలా కలుపుకోవాలి.

Egg Biryani

  • చివరిగా ఈ మిశ్రమంలో నానబెట్టిన రైస్.. అలాగే బియ్యం తగినంత నీరు వేసి మూత పెట్టేయాలి. అన్నం బాగా ఉడుకుతున్న సమయంలో.. స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలి. రైస్ ధం అయ్యేవరకు సిమ్ లోనే పెట్టీ ఉంచాలి.
  • రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత.. మంట ఆపేసి 5 నిమిషాల పాటు దాన్ని కదిలించకుండ ఉంచాలి. ఆ తర్వాత కొత్తిమీర, నిమ్మకాయ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ, యమ్మీ ఎగ్ బిర్యాని(Yummy Egg Biryani) రెడీ.

Also Read : పొట్టలో పేరుకున్న కొవ్వు కరిగిపోవాలా..అయితే కీరా దోసను ఇలా ట్రై చేయాల్సిందే!

#tasty #biryani-recipe #egg-biryani #bachelors
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe