Wooden : చెక్క పాత్రలు జిడ్డుగా కనిపిస్తున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!

ఈ మధ్య కాలం చాలా మంది వంట గదిలో ఉడెన్ పాత్రల ఎక్కువగా వాడుతున్నారు. కానీ వీటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే త్వరగా జిడ్డు, బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంటుంది. ఉడెన్ పాత్రలు క్లీన్ చేయడానికి ఈ సింపుల్ టిప్స్ పాటించండి. పూర్తి కంటెంట్ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Wooden : చెక్క పాత్రలు జిడ్డుగా కనిపిస్తున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!

Wooden Utensils : చెక్క(Wooden) తో తయారు చేసిన కప్స్, గరిటెలు, స్పూన్స్, పాత్రలు వాడడం చాలా ట్రెండ్ అయిపొయింది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే. వీటి వాడకం కూడా చాలా సులువు. అంతే కాదు చెక్క పాత్రల్లో వండితే మంచి టెస్ట్ తో పాటు ఆరోగ్యం కూడా అని చాలా మంది నమ్ముతారు. అయితే వంట గదిలో వీటిని వాడడం చాలా సింపుల్ అండ్ ఈజీ. కానీ వీటిని శుభ్రం చేసే విషయంలో జాగ్రతగా ఉండకపోతే ఆరోగ్యానికి చాలా నష్టం. చెక్క పాత్రలు శుభ్రంగా క్లీన్ చేయకపోతే వాటి జిడ్డు పెరడమే కాకుండా బ్యాక్టీరియా, ఫంగస్ కూడా చేరే ప్రమాదం ఉంటుంది. అందుకని ఉడెన్ పాత్రలు క్లీన్ చేసేటప్పుడు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉడెన్ పాత్రలు క్లీన్ చేయడానికి సింపుల్ టిప్స్

  • చాలా మంది పాత్రలు శుభ్రం చేసిన వెంటనే.. వాటిని తీసి కప్ బోర్డు లో పెట్టేస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే తడి కారణంగా వాటి పై ఫంగస్ చేరే ప్రమాదం ఉంటుంది. కావున క్లీన్ చేసిన తర్వాత కాసేపు గాలికి ఉంచి.. పొడిగా అయిన తర్వాత లోపల పెట్టాలి.
  • చెక్క పాత్రల పై నూనె జిడ్డు, ఇతర మరకలు తొలగించడానికి నీళ్లలో వెనిగర్ వేసి.. రాత్రంతా పాత్రలను దానిలో నాన బెట్టి క్లీన్ చేస్తే సరిపోతుంది.
  • ఉడెన్ పాత్రలను శుభ్రం చేసిన తర్వాత వాటి పై కాస్త హైడ్రోజన్ పెరాక్సైడ్‌ స్ప్రే చేయండి. దీని వల్ల పాత్రల పై క్రిములు, బ్యాక్టీరియా చేరే అవకాశం ఉండదు. కానీ మళ్ళి వాటిని వాడే ముందు శుభ్రంగా కడగడం తప్పనిసరి లేదంటే ఆరోగ్యానికి మంచిది కాదు.

Also Read : Health Tips: ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా..అయితే ఈ చిట్కాలు పాటించండి!

Wooden Utensils

  • సాధారణంగా కొంత మంది పాత్రలను డిష్ వాషర్ తో క్లీన్ చేస్తారు. కానీ ఉడెన్ పాత్రలను ఇలా చేస్తే అవి విరిగిపోయే ప్రమాదం ఉంది. కావున వీటిని చేతితో శుభ్రం చేయడం ఉత్తమం.
  • స్టీల్ పాత్రల కంటే చెక్క పాత్రల్లో జిడ్డు ఎక్కువగా పేరుకుపోతుంది. కావున ఉడెన్ పాత్రల్లో జిడ్డు, మురికి వదిలించడానికి క్లీన్ చేసే ముందు వేడి నీళ్లలో డిష్ వాషింగ్ లిక్విడ్(Dish Washing Liquid) వేసి నాన బెట్టడం మంచి చిట్కా. ఇలా చేస్తే మురికి, జిడ్డుతో పాటు చెడు వాసన కూడా పోతుంది.
  • చెక్క పాత్రలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా సరైన చిట్కా. పాత్రల పై బేకింగ్ సోడా.. కాస్త నిమ్మరసం పిండి స్క్రబ్బర్‌తో రద్దీతో మరకలు ఈజీగా పోతాయి. అయితే కొన్ని సార్లు ఉడెన్ పాత్రలు శుభ్రం చేసిన తర్వాత కూడా జిడ్డుగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో వాటి పై రాక్ సాల్ట్ చల్లి.. నిమ్మకాయ పీస్ తో గట్టిగా రుద్దితే వాటిలోని జిడ్డుతో పాటు బ్యాక్టీరియాను కూడా తొలగించి.. మంచి సువాసనను ఇస్తాయి.

Also Read : Health Tips: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్‌ , జాగింగ్‌ రెండింటిలో ఏది మంచిదంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు