Detoxification: ప్రతి రోజు శరీరం నుంచి చాలా విషపూరిత పదార్థాలు బయటకు వస్తాయి. మనం ఎప్పుడు తిన్నా, త్రాగినా, శరీరం వాటి నుంచి అవసరమైన పోషకాలను గ్రహించి.. మిగిలినవి పనికిరాని, అనవసరమైన వ్యర్థాలను తొలగిస్తాయి. కానీ ఈ అనవసరమైన అంశాలు శరీరం నుంచి బయటకు రాలేనప్పుడు, అవి విషపూరితంగా మారి శరీరంలో వ్యాధులను కలిగిస్తాయి. మీ శరీరం పూర్తిగా నిర్విషీకరణ చేయబడిందో లేదో తెలిపే లక్షణాలు ఇవే. ఎలాంటి వైద్య పరీక్ష లేకుండా కూడా, శరీరంలో టాక్సిన్స్ స్థాయిలు పెరుగుతున్నాయని చెప్పే సంకేతాలు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
మలబద్ధకం
రోజువారీ దినచర్యలో టాయిలెట్‌కి వెళ్ళకపోవడం, మలవిసర్జన చేయకపోవడం మలబద్ధకం సమస్యకు సంకేతం. శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతున్నాయని అర్థం. మలబద్ధకం సమస్య శరీరంలో టాక్సిన్స్‌ను పెంచుతుంది.
చెమట లేకపోవడం
చెమట ద్వారా శరీరం నుంచి టాక్సిన్స్ సులభంగా తొలగించబడతాయి. కానీ తక్కువ చెమట పట్టినప్పుడు లేదా తక్కువ శారీరక శ్రమ కారణంగా చెమట పట్టనప్పుడు, శరీరంలో టాక్సిన్స్ పెరగడం ప్రారంభమవుతుంది.
చర్మం పై మోటిమలు
చర్మం పై విపరీతమైన మొటిమలు కూడా శరీరంలో విషపూరితమైన పదార్ధాలు ఉన్నాయని తెలిపే సంకేతం. చాలా సార్లు మొటిమలు ముఖం మీద మాత్రమే కాకుండా వీపు, చేతులు, నడుము మీద కూడా వస్తాయి.ఇవి శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోయాయనే లక్షణాలు. ఇది కాకుండా, దద్దుర్లు , అలెర్జీ చర్మ సమస్యలు టాక్సిన్స్ ఉనికిని సూచిస్తాయి.
రోజంతా అలసటగా అనిపించడం
శారీరక శ్రమ లేకుండా కూడా రోజంతా అలసిపోయినట్లు అనిపించడం.. శరీరంలో టాక్సిన్స్ స్థాయిలు పెరుగుతున్నాయని తెలిపే లక్షణాలు.
బరువు తగ్గడం
శరీర బరువు ఎక్కువగా ఉండి బరువు తగ్గడం కష్టమవడం. దీనికి కారణం శరీరంలోని టాక్సిన్స్. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ మలబద్ధకం, పొట్టపై నిల్వ ఉండే కొవ్వు వల్ల వస్తుంది.
సరైన ఆహారం
అనారోగ్యకరమైన, జంక్ ఫుడ్ శరీరంలో టాక్సిన్స్ వేగంగా పేరుకుపోవడానికి కారణమవుతుంది. అలాగే ఒత్తిడి కూడా శరీరంలోని అవయవాల పై ప్రభావం చూపి.. శరీరం డిటాక్సి ఫై చేసుకోలేకపోవడానికి దారి తీస్తుంది.
శారీరక శ్రమ
శరీరంలో విషపూరిత పదార్థాలు పేరుకుపోవడానికి శారీరక శ్రమ లేకపోవడమే ప్రధాన కారణం. ఇది చెమట పట్టకపోవడానికి దారి తీస్తుంది. శారీరక వ్యాయామం ద్వారా మలబద్ధకం సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు.
కలుషిత వాతావరణం
చుట్టుపక్కల వాతావరణంలో అధిక మొత్తంలో కాలుష్యం శరీరంలో విషపూరిత పదార్థాలను చేరడానికి కారణమవుతుంది.
Also Read: Astrology: ఈ పనులు చేస్తే మీ ఇంట్లో అన్ని సుఖసంతోషాలే..!