సిద్దూ మూసేవాలా హత్య కేసు... కీలక నిందితున్ని భారత్ కు తీసుకు వచ్చిన అధికారులు...! By G Ramu 01 Aug 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి Sidhu Moosewala murder accused Sachin Bishnoi: ప్రముఖ సింగర్, కాంగ్రెస్ దివంగత నేత సిద్దూ మూసేవాలా హత్యకేసులో కీలక నిందితుడు సచిన్ బిష్ణోయ్ ను ఢిల్లీ పోలీసులు స్వదేశానికి తీసుకు వచ్చారు. కరుడు గట్టిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు సచిన్ బిష్ణోయ్ మేనల్లుడు. అతన్ని అజర్ బైజాన్(Azerbaijan) రాజధాని నుంచి భారత్ కు తీసుకు వచ్చామని ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరగోబిందర్ సింగ్ ధాలివాల్ తెలిపారు. గతేడాది మే 29న పంజాబ్ లోని మాన్సా ప్రాంతంలో సిద్దూ మూసే వాలాపై దుండగులు కాల్పులు జరిపారు. సిద్దూపై పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మాన్సా ఆస్పత్రికి తరలించగా అక్కడ సిద్దూ మరణించాడు. ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ హస్తం వుందని పోలీసులు గుర్తించారు. లారెన్స్ స్నేహితుడు కెనడా గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ పేరును కూడా పోలీసులు ఛార్జ్ షీట్ లో చేర్చారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారుల్లో సచిన్ బిష్ణోయ్ ఒకరు. సిద్దూ హత్య తర్వాత అతను దేశం నుంచి పారిపోయాడు. దీంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఇటీవల ఫేక్ పాసు పోర్టు కేసులో సచిన్ బిష్ణోయ్ ను అజర్ బైజాన్ పోలీసులు పట్టుకున్నారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు అజర్ బైజాన్ వెళ్లి సచిన్ బిష్ణోయ్ ను భారత్ కు తీసుకు వచ్చారు. సచిన్ బిష్ణోయ్ మొదట దుబాయ్ కు వెళ్లాడని పోలీసులు పేర్కొన్నారు. అక్కడి నుంచి పలు దేశాలకు వెళ్లినట్టు వెల్లడించారు. మరో వైపు ఇదే కేసులో కీలక నిందితుడు విక్రమ్ జీత్ సింగ్ అలియాస్ విక్రమ్ బ్రార్ ను ఎన్ఐఏ గతవారం అరెస్టు చేసింది. అతన్ని యూఏఈ నుంచి ఎన్ఐఏ అధికారులు భారత్ కు తీసుకు వచ్చారు. #sidhu-moosewala-murder-accused-sachin-bishnoi-extradited-to-india-from-azerbaijan #sidhu-moosewala-murder-accused #sachin-bishnoi-extradited-to-india #sidhu-moosewala-murder-case-accused-sachin-bishnoi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి