Sidda Raghava Rao: సొంతగూటికి మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు..!

మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు తన వర్గంతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబం తిరిగి టీడీపీకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

New Update
Sidda Raghava Rao: సొంతగూటికి మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు..!

Sidda Raghava Rao: మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు జగన్ కు లేఖ పంపించారు. రాజీనామా చేసిన దగ్గర నుండి శిద్ధా మొహం చాటేస్తున్నా.. తన వర్గంతో మాత్రం రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. సొంతగూటికి(TDP) కి వెళ్ళే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: జగన్ కు బిగ్ షాక్.. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే జంప్?

2024 ఎన్నికలకు ముందు టీడీపీకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారని అయితే, అధిష్టానం అందుకు విముఖత చూపిందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. 2014లో దర్శి నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు క్యాబినెట్లో అటవీశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన శిద్ధా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఏడాదికే తన కుమారుడు సుధీర్ తో కలిసి ఆయన వైసీపీలో చేరారు.

Also Read: రేపు అమరావతికి చంద్రబాబు.. ఆ ప్రాంతాన్ని పరిశీలించనున్న సీఎం.!

2024 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుండి టికెట్ అడిగినా వైసీపీ అధిష్టానం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో ఆయన పోటికి దూరంగా ఉండి రిసెంట్ గా పార్టీకి రాజీనామా చేశారు. అసలు శిద్ధా వ్యూహం ఏమిటి? ఏ పార్టీకి మోగ్గు చూపబోతున్నారు? అనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, వైసీపీని వీడే బాటలో మరికొంత మంది నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీని వీడిన వారిని టీడీపీ కాదంటే .. జనసేన లేదంటే బీజేపీకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు