/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/fire-1-jpg.webp)
Hanumakonda Fire Accident: హనుమకొండలోని వేయి స్తంభాల గుడి (Thousand Pillar Temple) దగ్గరున్న శ్రీనివాస కిడ్నీ ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం షార్ట్ సర్క్యూట్ తో ఫైర్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. హస్పిటల్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆపరేషన్ థియేటర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
షార్ట్ సర్య్కూట్ సంభవించడంతో ఆపరేషన్ థియేటర్లోని బెడ్లు అంటుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన పేషెంట్లు పరుగులు పెట్టారు. అగ్నిప్రమాదంలో ఆసుపత్రిలోని బెడ్లు, వస్తువులు, సామాగ్రి అంతా అగ్నికి ఆహుతై కాలిబూడిదైంది.
అయితే 101 ద్వారా సమాచారం అందుకున్న అగ్నిపమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుంది. మంటలను అదుపులోకి తీసుకొని రావడంతో పెను ప్రమాదం తప్పింది. పేషెంట్లను ఫైర్ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించింది. దీంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు