AP: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి షాక్.. మరోసారి కోర్టులో చుక్కెదురు..!

మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి కోర్టులో చుక్కెదురైంది. కారంపూడి సీఐపై దాడి, పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావును బెదిరించిన కేసులో బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌ను గుంటూరు కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో అరెస్టైన పిన్నెల్లి నెలరోజులుగా నెల్లూరు జిల్లా జైలులో ఉన్నారు.

New Update
Macherla : ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో ఊరట... మధ్యంతర బెయిల్‌ పొడిగింపు!

Pinnelli Ramakrishna Reddy: వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సమయంలో ప్రవర్తించిన తీరు రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈవీఎం ధ్వంసం, అడ్డుకున్న కారంపూడి సీఐపై దాడి చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్లు వేయగా గుంటూరు కోర్టు కొట్టివేసింది. అనంతరం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన నెలరోజులుగా నెల్లూరు జిల్లా జైలులో ఉంటున్నారు.

Also Read: RTVతో సౌదీ బాధితురాలు.. దయచేసి ‘నా భర్తను కూడా కాపాడండి’..మూడు నెలల నుంచి..

తాజాగా, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి కోర్టులో చుక్కెదురైంది. కారంపూడి సీఐపై దాడి, పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావును బెదిరించిన కేసులో బెయిల్ ఇవ్వాలని ఆయన గుంటూరు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

Advertisment
తాజా కథనాలు