Australia: ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే విద్యార్థులకు షాక్!

ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే విద్యార్థులకు నిజంగా ఇది షాకింగ్ న్యూస్. వలస వ్యవస్థను కొత్త విధానం ద్వారా గాడిలో పెట్టేందుకు అస్ట్రేలియా ప్రభుత్వం రెడీ అయ్యింది. దీనిలో భాగంగా విద్యార్థి, కార్మికుల వీసాలను సగానికి సగం తగ్గించాలని యోచిస్తోంది.

New Update
TS ECET : ఈసెట్‌ ఫలితాల తేదీ ఖరారు..

International Students : ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాలో మార్పులు చేయబోతోంది. ఆస్ట్రేలియాకు వచ్చే ఇంటర్నేషనల్ విద్యార్థులు(International Students) తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తుల వీసా(Visa) నిబంధనలను మరింత కఠనం చేస్తున్నట్లు ఆస్ట్రేలియా వెల్లడించింది. దీంతో వచ్చే రెండేళ్లలో వీరి వలసలను సగానికి సగం తగ్గించవచ్చని అంచనా వేస్తోంది. కుప్పకూలిన వలస వ్యవస్థను కొత్త విధానం ద్వారా గాడిలో పెట్టవచ్చేని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆశిస్తోంది.

ఆస్ట్రేలియా గణాంకాల ప్రకారం దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో వలసల సంఖ్య రికార్డుస్థాయిలో 5,10,000గా నమోదు అయ్యింది. ఒక ఏడాది ఈ సంఖ్యలో రావడం దేశ చరిత్రలోనే మొదటిసారి. వీరిలో ఎక్కువ మంది అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ సంఖ్యను సగానికి సగం తగ్గించే లక్ష్యంతో తాజా సంస్కరణకు రెడీ అయ్యింది. 2024-25, 2025-26 నాటికి వలసల సంఖ్య 2.5లక్షలకు పడిపోవచ్చని అంచనా వేస్తోంది. ఇది కోవిడ్ కు ముందున్న స్థాయికి సమానంగా ఉంటుంది. ఇక కొత్త వీసా నిబంధనల ప్రకారం...ఇంటర్నేషనల్ విద్యార్థులు ఇంగ్లీష్ నైపుణ్య పరీక్షల్లో ఎక్కువ రేటింగ్ పొందాల్సి ఉంటుంది. దీంతోపాటు వసతికి సంబంధించి విద్యార్థి దరఖాస్తును ఆస్ట్రేలియా ప్రభుత్వం మరింత నిశితంగా పరిశీలించే ఛాన్స్ ఉంది.

విదేశీ వలసలపై ఒత్తిడి:

కొత్త విధానంలో అనుసరిస్తోన్న వ్యూహంతో వలసల సంఖ్య సాధారణ స్థితికి వస్తుందని తాము భావిస్తున్నామని ఆస్ట్రేలియా హోంశాఖ మంత్రి క్లేర్ ఓనీల్ పేర్కొన్నారు. నూతన వలస విధానంపై మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇది ఆస్ట్రేలియా భవిష్యత్తుకు సంబంధించిన విషయమని తెలిపారు. తాజా నిర్ణయం విదేశీ వలసలపై ఒత్తిడి పెంచుతుందన్నారు. తద్వారా వలసదారుల సంఖ్య తగ్గుదులకు దోహదం చేస్తుందన్నారు. మరోవైపు దేశంలో వలస విధానంపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ ఈ మధ్యే మాట్లాడారు. దేశంలో వలసలు ఆందోళణ స్థాయికి చేరుకున్నాయని, వీటి సంఖ్య స్థిరమైన స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

భారీగా పెరిగిన ఇంటి అద్దెలు: 

కాగా కోవిడ్ సమయంలో ఏర్పడిన కార్మికుల కొరతను భర్తీ చేసేందుకు ఆస్ట్రేలియా సర్కార్ ఈ మధ్యే భారీ స్థాయిలో వలసలను ప్రోత్సహించింది. దీంతో విదేశీ విద్యార్థులు, నిపుణులు ఆస్ట్రేలియా వైపు ఫోకస్ పెట్టారు. అప్పటికే గ్రుహ సంక్షోభం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా పై ఈపరిణామం మరింత ఒత్తిడిని పెంచింది. ఆస్ట్రేలియా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇటీవల ఇంటి అద్దెలు 7.6శాతం పెరిగాయి. 2009 తర్వాత ఈ స్థాయిలో పెరగడం కూడా ఇదే తొలిసారి. ఇలా గ్రుహ సంక్షోభం పెరగడం భారీ స్థాయిలో రావడం స్థానికంగా మౌళిక సదుపాయల కల్పనకు మరింత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో విద్యార్థి, నిపుణుల వలసలను సగానికి సగంతగ్గించి..కేవలం అత్యంత నైపుణ్యం కలిగినవారికే శాశ్వత నివాసం కల్పిస్తూ దేశంలోని అనుమతించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

ఇది కూడా చదవండి: ఆ బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులకు మెడికల్ కౌన్సిల్ అదిరిపోయే శుభవార్త!

Advertisment
తాజా కథనాలు