Crime: విశాఖ కేజీహెచ్ లో లైంగిక వేధింపులు.. నర్సింగ్ సూపరిండెంట్ సంచలన వ్యాఖ్యలు..!

విశాఖ కేజీహెచ్ లో లైంగిక వేధింపుల విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూపరిండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ లైంగికంగా వేదించారంటూ నర్సింగ్ సూపరిండెంట్ పోలీసులకు పిర్యాదు చేసింది. విశాఖ ఒన్ టౌన్ పోలీసులు డాక్టర్ అశోక్ కుమార్ పై FIR నమోదు చేశారు.

New Update
Crime: విశాఖ కేజీహెచ్ లో లైంగిక వేధింపులు.. నర్సింగ్ సూపరిండెంట్ సంచలన వ్యాఖ్యలు..!

Visakhapatnam KGH:  విశాఖ కేజీహెచ్ లో లైంగిక వేధింపులు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దింతో ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల ఆరోగ్య ప్రదాయిని విశాఖ కేజీహెచ్ మరోసారి వార్తల్లో నిలిచింది. సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ పై లైంగిక వేధింపులు ఆరోపణ ప్రస్తుతం తెరపైకి వచ్చింది. సూపరిండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ లైంగికంగా వేదించారంటూ నర్సింగ్ సూపరిండెంట్ పోలీసులకు పిర్యాదు చేసింది.

Also read: కలుషిత నీరు తాగి అస్వస్థత.. ముగ్గురు మృతి..!

ఇదిలా ఉండగా ఇటీవలే విధుల నుంచి సస్పెండ్ చేసిన నర్సింగ్ సూపరింటెంట్ విజయలక్ష్మి.. డాక్టర్ అశోక్ కుమార్ తనను లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సంచలన ఆరోపణ చేసింది. దీంతో విశాఖ ఒన్ టౌన్ పోలీసులు డాక్టర్ అశోక్ కుమార్ పై లైంగిక వేధింపులు కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.

Also Read: ఉపాది కూలీలపై తేనేటీగల దాడి.. 50 మందికి పైగా గాయాలు

ఇటీవలే అత్యాచార బాధితురాలికి పోర్న్ వీడియోలు చూపించి అసభ్యకరంగా ప్రవర్తించిన KGH కంప్యూటర్ ఆపరేటర్ విషయం మరువకముందే.. డాక్టర్ అశోక్ కుమార్ పై లైంగిక వేదిపుల కేసు నమోదు కావడం సర్వత్ర చర్చ నియంశంగా మారింది. విశాఖ రాజధానిగా గుర్తింపు సంతరించుకుంటున్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కావడం కలవరపాటుకు గురిచేస్తుంది. కె జి హెచ్ సూపరిండెంట్ పై ఇటువంటి ఆరోపణలు రావడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు