Crime News: గంజాయి విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం.. ఏడుగురు అరెస్ట్..!

అనంతపురం జిల్లాలో గంజాయి విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. ముఠాలో కర్నూలు జిల్లా వాసులు నలుగురు ఉండగా.. మరో నలుగురు అనంతపురం జిల్లాకు చెందిన వారని ఎస్పీ తెలిపారు.

Crime News: గంజాయి విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం.. ఏడుగురు అరెస్ట్..!
New Update

Ananthapuram: అనంతపురం జిల్లాలో గత కొన్ని రోజులుగా చాప కింద నీరులా విస్తరిస్తున్న గంజాయి విక్రయాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని కొనుగోలు చేసి వాటిని చిన్నచిన్న ప్యాకెట్లలోకి మార్చి యువతను టార్గెట్ చేసుకొని విక్రయాలు సాగిస్తున్నారు. ఈ ముఠాలపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

Also Read: టీవీ యాంకర్ ను కిడ్నాప్ చేసిన త్రిష్ణ అరెస్ట్.. కారణం ఇదే..!

తాజాగా ఏడు మందిని గుంతకల్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలోని షికారి నాగు, నరసప్ప, నిస్సార్ అహమ్మద్, మేకల ప్రసాద్ , షికారి మంజులలు ముఠాగా ఏర్పడి మిగితా ఇద్దరు నిందితులైన ఎర్రతోట లక్ష్మణ్ణ, పోయింటి ఈరన్నల నుండీ గంజాయి కొనుగోలు చేస్తారు. ఒక కిలో 11 వేలుకు కొనుగోలు చేసి కిలో గంజాయిని 300 ప్యాకెట్లుగా మార్చుకుంటారు.

Also Read: వావ్..! సినిమాకు మించి రకుల్ వెడ్డింగ్ వీడియో.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

ఇలా.. ఒక్కో ప్యాకెట్ ను 150 రూపాయల ప్రకారం గుంతకల్లు, అనంతపురం, బుక్కరాయసముద్రం, గుత్తి, తదితర ప్రాంతాలలో విక్రయించి అధిక సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల గంజాయి విక్రయాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన ఎస్పీ అన్బురాజన్ పోలీసులకు గట్టి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారంతో గుంతకల్ పోలీసులు ముఠాను పట్టుకున్నారు.  ఎవరైనా గంజాయి విక్రయించినా లేదా దానిని సేవించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

#anantapur-district
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe