Aishwarya: నటి ఐశ్వర్య భర్త శ్యామ్ కుమార్ ఎపిసోడ్ లో ట్విస్ట్.. లైవ్ లో ఫోన్ కాల్స్ వినిపించిన భర్త..!

నటి ఐశ్వర్య ఎపిసోడ్ లో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఐశ్వర్య ఫోన్ కాల్స్ లైవ్ లో వినిపించాడు భర్త శ్యామ్ కుమార్. భర్త మంచివాడు కాదని శాడిస్ట్ అంటూ ఐశ్వర్య మాట్లాడినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఐశ్వర్య మందు, సిగరెట్లు తాగేదని వివాహేతర సంబంధం ఉందని భర్త ఆరోపిస్తున్నారు.

New Update
Aishwarya: నటి ఐశ్వర్య భర్త శ్యామ్ కుమార్ ఎపిసోడ్ లో ట్విస్ట్.. లైవ్ లో ఫోన్ కాల్స్ వినిపించిన భర్త..!

Serial Actress Aishwarya: నటి ఐశ్వర్య భర్త శ్యామ్ కుమార్ ఎపిసోడ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఐశ్వర్య ఫోన్ కాల్స్ లైవ్ లో వినిపించాడు శ్యామ్ కుమార్ . భర్త మంచివాడు కాదని శాడిస్ట్ అంటూ ఫోన్ లో ఐశ్వర్య మాట్లాడినట్లుగా తెలుస్తోంది. పెళ్లైన తర్వాత రూ. 25 లక్షలు కాజేసి విడాకులివ్వాలంటూ..మానసికంగా వేధిస్తోందని భర్త ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. పెళ్లి చేసుకొని మందు సిగరెట్లు నిత్యం తాగేదని.. ఐశ్వర్యకి వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. పలు తెలుగు సీరియల్స్ లో గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. 2023 సెప్టెంబర్ 6న నటి ఐశ్వర్య.. పిన్నింటి శ్యామ్ కుమార్ ల పెళ్లి జరిగింది. కాపు మ్యాట్రిమోని ద్వారా వీరిద్దరు వివాహం చేసుకున్నారు.  అయితే, పెళ్లి అయిన నెల రోజుల తరువాత ఐశ్వర్య వివాహేతర సంబంధం బయటపడిందని ఆమె భర్త ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన రియల్టర్ కరణం రమేష్ బాబుతో  రిలేషన్ పెట్టుకుని, తనని బెదిరింపులకు పాల్పడుతుందంటూ భర్త శ్యామ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Also Read: జనసేన పోటీ చేసే 21 సీట్ల లిస్ట్‌ ఇదే..! పవన్ పోటీ అక్కడ నుంచే..?

అంతేకాకుండా పెళ్లయిన తర్వాత రూ.25 లక్షలు కాజేసి విడాకులు కావాలని, తనని, తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోతున్నాడు. తనకు న్యాయం చేయాలని బాధిత భర్త శ్యామ్ కుమార్ మీడియాను ఆశ్రయించాడు. అయితే దీనిపై ఐశ్వర్య మాత్రం ఇంకా స్పందించలేదు.

Advertisment
తాజా కథనాలు