Crime News: స్కూటీ అంటే పాప.. బైక్‌ అంటే బాబు..మేడిపల్లి శిశువుల అమ్మకం కేసులో సంచలన విషయాలు..!

హైదరాబాద్‌ మేడిపల్లి శిశువుల అమ్మకం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పసికందుల విక్రయానికి అంతరాష్ట్రముఠా కోడ్ భాష వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. పాపను స్కూటీగా, బాబును బైక్‌గా పిలుస్తూ కోడ్‌ భాషలో సంభాషించేవారు.

New Update
Crime News: స్కూటీ అంటే పాప.. బైక్‌ అంటే బాబు..మేడిపల్లి శిశువుల అమ్మకం కేసులో సంచలన విషయాలు..!

Hyderabad Medipalli: హైదరాబాద్‌ మేడిపల్లి శిశువుల అమ్మకం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పసికందుల విక్రయానికి అంతరాష్ట్రముఠా కోడ్ భాష వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. పాపను స్కూటీగా, బాబును బైక్‌గా పిలుస్తూ కోడ్‌ భాషలో సంభాషించేవారు.

Also Read: ప్రియుడి టార్చర్‌.. రోడ్డుపైనే పలుసార్లు ఇలా వేధించేవాడు..!

వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వేదికగా కోడ్ భాషలో చాటింగ్‌ చేసేవారు. అందుకు సంబంధించిన చాటింగ్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసు విచారణను వేగవంతం చేసిన హైదరాబాద్ పోలీసులు.. ఢిల్లీ, యూపీ, పుణే నగరాల్లోని ముఠాలపై ఆరా చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ 11 మంది అరెస్టు చేశారు. ఢిల్లీ,పుణేల నుంచి శిశువులను ఎత్తుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు లేని వారికి అమ్మేసేవారు. ఒక్కో శిశువును రూ. 5 లక్షలకు అమ్మినట్లు అధికారులు గుర్తించారు.

Advertisment
తాజా కథనాలు