Veligonda Project: వెలిగొండ ప్రాజెక్ట్ ఇందుకే తయారు చేశారు: శ్రీనివాస్

వెలిగొండ ప్రాజెక్ట్ ను సీఎం జగన్ రేపు జాతికి అంకితం చేయబోతున్నారని తెలిపారు సీనియర్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ శ్రీనివాస్ వర్మ. 1995లో ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు నిరంధించేందుకు ఈ ప్రాజెక్ట్ తయారు చేసినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ పై క్లిక్ చేయండి.

Veligonda Project: వెలిగొండ ప్రాజెక్ట్ ఇందుకే తయారు చేశారు: శ్రీనివాస్
New Update

Irrigation Expert Srinivas Verma: విశాఖలో RTVతో సీనియర్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ శ్రీనివాస్ వర్మ ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడారు. ఏళ్ల తరబడి నిర్మాణం నోచుకోని వెలిగొండ ప్రాజెక్ట్ ను రేపు సీఎం జగన్ జాతికి అంకితం చేయబోతున్నారని తెలిపారు. 1995లో ఆనాటి ముఖ్యమంత్రి విజయ భాస్కర్ రెడ్డి హయాంలో ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు నిరంధించేందుకు వెలిగొండ ప్రాజెక్ట్ ని తయారు చేసినట్లు వెల్లడించారు. దీనికి మొదటగా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 1996 మార్చ్ 5 శంకుస్థాపన చేశారని తెలిపారు. అయితే, దాదాపు 29 ఏళ్ల వరకు ఈ ప్రాజెక్టును ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశారని వాపోయారు.

ప్రకాశం జిల్లా కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగంలోని కొల్లం వాగు వరకు రెండో టన్నెల్ పనులను చేపట్టారని వ్యాఖ్యానించారు. మొదటి సొరంగం 7 డయా మీటర్ల వ్యాసార్థంతో తవ్వితే, రెండో టన్నెల్ 9.2 డయా మీటర్ల వ్యాసార్థంతో తవ్వారన్నారు. తొలి టన్నెల్ నుంచి 3 వేల క్యూసెక్కులు, రెండో టన్నెల్ నుంచి 8500 క్యూసెక్కుల చొప్పున రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేందుకు వీటిని నిర్మించారని వెల్లడించారు.

Also Read: ఎమ్మెల్సీకి చెప్పు చూపించిన ఎంపీ.. సిద్ధం సభలో సవాల్!

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను వెలిగొండలో భాగమైన నల్లమలసాగర్‌కు తరలించిందుకు టన్నెల్ పనులను ప్రభుత్వం చేపట్టిందని.. శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులను తరలించి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమలసాగర్‌లో నిల్వ చేసి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో 4,47,300 ఎకరాల ఆయకట్టుకు సాగు నీళ్లందించడంతోపాటు 15.25 లక్షల మంది తాగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

తరువాత వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం భాగంగా 2004 అక్టోబర్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారన్నారు. మొదటి టన్నెల్ 7 రెండవ టన్నల్ 9.2 మీటర్ల వ్యాసంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన టన్నల్ బోరింగ్ మిషన్లతో ఈ పనులను 2008లో ప్రారంభించారని వ్యాఖ్యానించారు. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలతో కాంగ్రెస్ పార్టీ హయాంలో 11.586 కిలో మీటర్లు తవ్వాగా టీడీపీ హాయంలో 4.331 కిలో మీటర్లతో పాటు హెడ్ రెగ్యులేటర్లు నిర్మించారనిచ వెల్లడించారు. ఈ టనెల్స్ స్వరంగ మార్గంగా తయారు చేయబడిందని కామెంట్స్ చేశారు.

#veligonda-project #irrigation-expert-srinivas-verma
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి