IPS Naveen Kumar Arrest: ఓ విశ్రాంత ఐఏఎస్ ఇంటిని తన సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడన్న ఆరోపణలపై ప్రస్తుత ఐపీఎస్ అధికారిపై కేసు నమోదైంది. ఫోర్జరీ కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి విచారిస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ ఫిర్యాదు మేరకు ప్రస్తుత ఐపీఎస్ నవీన్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Telangana: రైతుబంధుపై సందిగ్ధత.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.. విశ్రాంత ఐఏఎస్ భన్వర్ లాల్ ఇంట్లో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఇల్లు ఖాళీ చేయకుండా కబ్జా చేయడానికి ప్రయత్నించారంటూ భన్వర్ లాల్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానికితోడు నకిలీ పత్రాలను సృష్టించి తన ఇంటిని కబ్జా చేయడానికి ప్రయత్నించారని నవీన్ కుమార్‌పై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో నవీన్ కుమార్‌పై ఫోర్జరీ కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నవీన్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా ఉన్నారు.