Nizamabad: లిఫ్టులో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించిన సెక్యూరిటీ గార్డు..!

నిజామాబాద్ జిల్లా కోటగల్లిలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్టులో సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయాడు. రెండు కాళ్లు బయట.. బాడీ లోపల ఉండిపోవడంతో నరకయాతన అనుభవించాడు. ఈ ఘటనలో అతడికి కాళ్లు చేతులు విరిగిపోయినట్లుగా తెలుస్తోంది.

New Update
Nizamabad: లిఫ్టులో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించిన సెక్యూరిటీ గార్డు..!

Nizamabad: నిజామాబాద్ జిల్లా కోటగల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లావణ్య అక్రేడ్ షాపింగ్ కాంప్లెక్స్  లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు HDFC బ్యాంక్ సెక్యూరిటీ గార్డు. రెండు కాళ్ళు బయట.. బాడీ లిఫ్ట్ లో ఉండిపోవడంతో దాదాపు గంటన్నర పాటు నరకయాతన అనుభవించాడు. ఫైర్ రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేయడంతో ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు సెక్యూరిటీ గార్డ్ మహేందర్ గౌడ్. ఈ ప్రమాదంలో అతడు కాళ్లు చేతులు విరిగి కొన ఊపిరితో ఉన్నట్లు తెలుస్తోంది.

కాళ్లు బయట.. బాడీ లోపల..

తీవ్రంగా గాయపడ్డ సెక్యూరిటీ గార్డును హుటాహుటిన 108 వాహనంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో HDFC హౌసింగ్ లోన్ బ్యాంక్ లో మహేందర్ గౌడ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. వాష్ రూముకు లిఫ్ట్ లో వెళ్లి తిరిగి వస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్ లో దిగే క్రమంలో కాళ్లు బయట పెడుతున్న క్రమంలో లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయి కాళ్లు బయట బాడీ లోపల ఉండిపోయింది.

Also Read: సెల్ఫీ తీసుకుంటూ గ్రామ వాలంటీర్ మృతి

అతడి అరుపులు కేకలు విన్న స్థానికులు వెంటనే హైదరాబాద్ లోని ఫైర్ సహాయక సెంటర్ కు టోల్ ఫ్రి నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. హుటాహుటిన నిజామాబాద్ ఫైర్ స్టేషన్ రెస్క్యూ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టి అరగంటలో అతన్ని బయటకు తీశారు. అయితే, కొన్ని రోజులుగా లిఫ్టు సరిగ్గా పనిచేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాగే రెండు మూడు సార్లు మధ్యలోనే ఆగిపోవడంతో టెక్నీషియన్లు వచ్చి రిపేర్ చేసి ఆగిపోయిన లిఫ్ట్ ను బాగు చేసి సిబ్బందిని బయటకు తీసిన ఘటనలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు.

యజమానిపై తీసుకొని చర్యలు

అలాగే ఇదే షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న దావత్ హోటల్లో సిలిండర్లు పెళ్లి భారీ అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలు ఆర్పడంతో అప్పట్లో కూడా అనేకమంది ప్రాణాలను ఇదే ఫైర్ సిబ్బంది కాపాడారన్నారు. అయితే, కాంప్లెక్స్ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఫైర్ ఆఫీసర్ల పై మండిపడుతున్నారు. ఇప్పటి వరకు రెండు ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఇంతవరకు కూడా షాపింగ్ కాంప్లెక్స్ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని పోలీసులు, ఫైర్ సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు