రాజకీయాలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును వాయిదా వేసిన సీబీఐ కోర్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించిన విచారణణు నాంపల్లి సీబీఐ కోర్టు వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేసింది. వివేకా హత్య కేసుపై సోమవారం మరోసారి విచారణ జరిపిన కోర్టు.. తదుపరి విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఈ విచారణకు కడప ఎంపీ అవినాష్ తో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లు హాజరయ్యారు. ఈ కేసుపై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఈ రోజు విచారణ చేపట్టగా.. కోర్టు కాసేపు వాయిదా వేసింది. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగష్టు 15 వేడుకులకు సర్వం సిద్ధమైంది. స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 9 గంటలకు ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇప్పటికే ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను కూడా స్టేడియంలో సిద్ధం చేశారు. శకటాల ప్రదర్శనను తిలకించిన సీఎం జగన్.. అనంతరం పలువురికి అవార్డులను అందజేస్తారు. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Raghuram krishna raju: రుషికొండపై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు: ఎంపీ రఘురామ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై, మంత్రులు రోజా, అమర్నాథ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘు రామకృష్ణ రాజు. రుషికొండపై జగన్ ప్రభుత్వం పర్యాటకానికి సంబంధం లేకుండా.. అక్రమ నిర్మాణాలు చేపడుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. గెస్ట్ హౌస్ లను వేరొకరి పేరు మీద పెట్టి.. 99 సంవత్సరాల కోసం లీజుకు ఇచ్చి.. జగన్ దంపతుల సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు ఎంపీ రఘురామ. అలాగే పర్యాటకం ముసుగులో ముఖ్యమంత్రి ఇల్లు, వ్యక్తిగత అవసరాల కోసం కార్యాలయన్ని కడుతున్నారని విమర్శించారు. రుషి కొండలో కడుతున్న గెస్ట్ హౌస్ లను జగన్ దంపతులు సొంతం చేసుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ నిర్మాణాలను అధికారంలోకి వచ్చే ప్రభుత్వం వెంటనే కూల్చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘురామ. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bear spotted at Srivari Mettu: తిరుమలలో ఎలుగు బంటి కలకలం.. భయాందోళనలో భక్తులు శ్రీవారి మెట్ల మార్గంలో సోమవారం 2000వ మెట్టు వద్ద భక్తులు ఎలుగు బంటి కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. ఎలుగు బంటిని కొందరు భక్తులు తమ సెల్ ఫోన్ లలో ఫొటోలు తీసి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అధికారులు మెట్ల మార్గానికి చేరుకుని, పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నారు. ఎలుగు బంటి సంచారం ఎక్కువైన నేపథ్యంలో టీటీడీ అలర్ట్ అయ్యింది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించడం లేదు. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలను సైతం నిషేధించింది. అంతేకాకుండా నడకమార్గాల్లో చిన్నారుల చేతులకు ట్యాగ్ లు కడుతున్న సంగతి తెలిసిందే. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyderabad and Charminar Express Robbed: ఆ రెండు రైళ్లే వారి టార్గెట్.. అర్థరాత్రి చొరబడి బీభత్సం సృష్టించిన దొంగలు సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్7, ఎస్8 బోగీల్లోకి ప్రవేశించిన దొంగలు.. అందినకాడికి ఎత్తుకెళ్లారు. అలాగే సికింద్రాబాద్ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్లో కూడా చోరీ చేశారు. చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎస్1, ఎస్2 బోగీల్లో దొంగతనం చేశారు. నిద్రిస్తున్న మహిళల మెడల్లో నుంచి బంగారు చైన్లు, ఆభరణాలను అపహరించారు. దీంతో తేరుకున్న ప్రయాణికులు ఒక్కసారిగా అరుపులు, కేకలు పెట్టారు. దీంతో అలర్ట్ అయిన గార్డులు.. తెట్టు, కావలి రైల్వే పోలీస్ స్టేషనల్లో ఫిర్యాదు చేశారు. బంగారం చోరీకి సంబంధించి ప్రయాణికులు తమ వివరాలను పోలీసులకు వివరించారు. ఈ మేరకు కావలిలో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గార్డు ఫిర్యాదుతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. స్థానిక పోలీసులకు కూడా సమచారం ఇచ్చారు. చోరీ జరిగిన ప్రాంతం సమీపంలోని గ్రామాలు, తదితర ప్రదేశాలను గాలిస్తున్నారు. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Parvathipuram: ఆ ప్రాంతంలో వింత ఆచారం.. నాలుకతో నైవేద్యం సేకరిస్తే అలా జరుగుతుందట!! శ్రీకాకుళం లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన రైతులు.. వర్షాలు పడాలని వినూత్నంగా ప్రత్యేకమైన పూజలతో పాటు, ఆచార వ్యవహారాలు పాటిస్తారు. గ్రామ సమీపంలోని నాలుగు కిలో మీటర్ల దూరంలోని కొండపై ఉన్న అమ్మవారి ఆలయానికి డప్పు వాయిద్యాలతో వెళ్తారు. అక్కడ అమ్మవారికి కోడి లేదా మేకను బలి ఇస్తారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న సరుకులతో అక్కడే 'వరద పాయసం' తయారు చేసుకుంటారు. దాన్ని అక్కడ కొండపైనే నేలపై వేసుకుని.. నాలుకతో ఆ వరద పాయసాన్ని స్వీకరిస్తారు రైతులు. ఇలా చేస్తే వర్షాలు బాగా కురిసి.. పంటల బాగా పండుతాయని వారి నమ్మిక. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమలలో మరో చిరుత హల్చల్.. భక్తులు జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు తిరుమల నడకదారిలో మరో చిరుత కలకలం రేపింది. ఓ బాలుడు చిరుతను చూశాను అని చెప్పడంతో.. భక్తులందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురై, అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మళ్లీ చిరుత ఎవరిపై దాడి చేస్తుందోమోనని భయంతో అరుపులు, కేకలు పెట్టారు భక్తులు. నామాలగవి దగ్గర చిరుత కనిపించిందని పులి కనిపించిందని ఆ బాలుడు చెబుతున్నాడు. దీంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. వెంటనే బాలుడు చెప్పిన తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తున్నారు. బోను చిక్కింది పెద్ద పులి అయి ఉంటుందని, ఇవి దాని పిల్లలు అయి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా భక్తులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Villagers stopped MLA Sridevi : వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి చేదు అనుభవం.. అడ్డుకున్న గ్రామస్తులు కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి చేదు అనుభవం ఎదురైంది. పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీదేవి ఖాసీం స్వామి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ క్రమంలో మహిళలు, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. గ్రామానికి ఏం చేశారని నిలదీశారు. గో బ్యాక్.. డౌన్ డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలతో హోరెత్తించారు గ్రామస్తులు. గొడవలు జరిగే అవకాశం ఉందని ముందే సమాచారం అందుకున్న పోలీసులు.. పుచ్చకాయలమడ గ్రామానికి చేరుకున్నారు. ఒక్కసారిగా గ్రామస్తులు అక్కడికి దూసుకు రావటంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామస్తులను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే శ్రీదేవి అక్కడి నుంచి వెనుదిరగారు. ఎమ్మెల్యే వెళ్లిపోవడంలో ఉద్రిక్త వాతావరణం సాధారణ స్థితికి వచ్చింది. By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: దండుపాళ్యం బ్యాచ్, వలంటీర్లకు తేడా లేదు: పవన్ కళ్యాణ్ దండు పాళ్యం బ్యాచ్ కు, వలంటీర్లకు తేడా లేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శనివారం పెందుర్తి నియోజకవర్గంలో వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృద్ధురాలిని వలంటీర్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడని విచారం వ్యక్తం చేశారు.కేవలం బంగారు నగల కోసం కిరాతకంగా వ్యవహారించాడని అన్నారు. ఈ కేసులో వలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటపెట్టిన పోలీసులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని అన్నారు. వారు ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, పాస్పోర్టు కావాలన్నా పోలీసు వెరిఫికేషన్ చేస్తారని.. వాలంటీర్ల నియామకంలో మాత్రం ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ తీసుకోవడం లేదని అన్నారు. ఇదేమి విధానం అని పవన్ ప్రశ్నించారు. వ్యవస్థలను, శాంతి భద్రతలను కాపాడటం జనసేన బాధ్యత అన్నారు. By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn