Largest Reservoir: ఖగోళంలో ఎన్నో అద్భుతాలతో పాటు ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు చాలానే ఉన్నాయి. శాస్త్రవేత్తలు జరిపే పరిశోధనల్లో ఎప్పుడూ ఏదోక విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. అయితే.. తాజాగా ఓ విశ్వ రహస్యాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మన భూమిపై ఉన్న మహా సముద్రాలలోని నీటి కంటే కూడా ఎక్కువ పరిమాణం అంతరిక్షంలో ఉన్నట్టు కనిపెట్టారు. బ్లాక్ హోల్ (కృష్ణ బిలం)లో భూమిపైన ఉన్న నీళ్ల ద్రవ్యరాశి కంటే దాదాపుగా 140 ట్రిలియన్ రెట్లు ఉన్న పురాతన నీటి రిజర్వాయర్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాలిఫోర్నియా యూనిర్సిటీ శాస్త్రవేత్తలు కూడా దీన్ని నిర్థారించారు. అంతేకాకుండా ఇది తేలియాడుతూ కనిపిస్తోందని, చూసేందుకు కూడా ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉందని చెబుతున్నారు.
టెలిస్కోప్‌కి కనిపిస్తుందా?
స్పేస్‌లో శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ భారీ నీటి రిజర్వాయర్ దాదాపుగా 12 బిలియన్ కాంతి సంవత్సరాలకు మించి దూరంలోని కృష్ణ బిలం దగ్గర క్వాసార్ అని పిలిచే భారీ ఫీడింగ్ బ్లాక్ హోల్‌తో చుట్టూ ఉందని చెబుతున్నారు. ఇది టెలిస్కోప్‌లో కూడా కనిపించదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే దీన్ని గుర్తించడం కూడా ఆలస్యం అయిందని చెబుతున్నారు.
అంతరిక్షంలో అతిపెద్ద రిజర్వాయర్ ఇదేనా
నిజానికి క్వాసార్స్ అనేది మండుతున్న యాక్టివ్ గెలాక్సీలుగా పిలుస్తారు. పెద్ద పెద్ద పరిమాణంలో ఉంటూ వాయువును తినే సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ద్వారా ఇవి శక్తిని గ్రహిస్తాయి. శాస్త్రవేత్తలు చెబుతున్నదాని ప్రకారం ఈ క్వాసార్స్ చుట్టూ ఉన్న పర్యావరణం ఎంతో ప్రత్యేకం. ఇది భారీ స్థాయిలో నీటిని అందిస్తుందని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన ఓ శాస్త్రవేత్త చెబుతున్నారు. ప్రస్తుతం అంతరిక్షంలోని బ్లాక్ హోల్ దగ్గర అతిపెద్ద వాటర్ రిజర్వాయర్ ఇలానే ఏర్పడిందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత కాలంలో గుర్తించిన క్వాసార్ లేదా నీటి రిజర్వాయర్‌ను శాస్త్రవేత్తలు వెయ్యి ట్రిలియన్ సూర్యులకంటే అధిక శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.