Inspirational Story: స్కూల్‌ మధ్యలోనే మానేసింది..కానీ పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కింది.. పారిశుద్ధ్య కార్మికురాలి కథ ఇది!

ఓ పారిశుధ్య కార్మికులు రాసిన పుస్తకాన్ని కాలికట్‌ విశ్వవిద్యాలయం , కన్నూర్‌ విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, బీఏ లో పాఠ్యాంశంగా చేర్చారు. తిరువనంతపురంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా చేస్తున్న ధనుజ సక్సెస్ స్టోరీ ఈ కథనంలో...

Inspirational Story: స్కూల్‌ మధ్యలోనే మానేసింది..కానీ పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కింది.. పారిశుద్ధ్య కార్మికురాలి కథ ఇది!
New Update

Inspirational Story: తిరువనంతపురంలోని ప్రభుత్వ సచివాలయానికి సమీపంలో ఉన్న చెంకల్‌ చూల కాలనీగా ప్రసిద్ది చెందిన రాజాజీ నగర్‌ వారి అయిన ధనుజ కుమారి చెంకల్‌ చూళాయిలే అఏ పుస్తకాన్ని రాసింది. ఆమె జీవిత అనుభవాలనే పుస్తక రూపంలో తీసుకోచ్చింది. ఆ పుస్తకాన్ని ఇటీవల కాలికట్‌ విశ్వవిద్యాలయం , కన్నూర్‌ విశ్వవిద్యాలయాల్లో ఆ పుస్తకాన్ని ఎంఏ, బీఏ పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చారు. ఇందులో కొత్తమే ఉంది అనుకుంటున్నారా..ఇక్కడే ఉంది అసలు మేటర్ ఏంటంటే...ఆ పుస్తకం రాసింది పీహెచ్‌డీ పట్టాలు పొందిన వ్యక్తులు కాదు..పేరుమోసిన రచయితలు కాదు..ఓ పారిశుద్ద్య కార్మికురాలు. ఆమె ధనుజ కుమారి.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్‌ ని కలిసినప్పుడు ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..ఆమె తన జీవితం గురించి..తన అనుభవాల గురించి వివరించారు. తాను కూడా చాలామందిలాగే పాఠశాల విద్యను మధ్యలోనే మానేశానని, ఆ తరువాత తాను అనుభవించిన బాధలు, జీవించిన తీరుతో పాటు...చెంకల్‌ చూల కాలనీకి చెందిన చాలామంది క్రిమినల్‌ కేసుల్లో చిక్కుకోవడం వల్ల ఆ ప్రాంతం అంతా అపఖ్యాతి పాలైందని వివరించారు.ఆ సమయంలోనే తాను నివసిస్తున్న కాలనీ ఎలాంటిదో ప్రపంచానికి తెలియజేయాలని ఆమె నిశ్చయించుకున్నట్లు వివరించారు.

పుస్తక రచయిత ధనుజ కుమారి ప్రస్తుతం... పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు. ధనుజకు ఆమె భర్తతో పాటు తన ఇద్దరు కుమారులు కూడా ఎప్పుడు అండగా ఉంటూ పుస్తకం రాయడానికి ప్రోత్సాహం అందించేవారు. కుమారి రచించిన మొదటి పుస్తకానికి మంచి స్పందన రావడంతో ఆమె చెంకల్‌ చూళా చరిత్ర గురించి మరో పుస్తకాన్ని రాయడం ప్రారంభించింది.

అంతేకాకుండా ఆమె స్థానికంగా ఓ లైబ్రరీని కూడా ప్రారంభించే యోచనలో కూడా ఉన్నారు. 2014లో చెంకల్‌ చూలకాలనీని సందర్శించిన సాంస్కృతిక కార్యకర్తల బృందం ధనుజ కుమారి రచనను గుర్తించి ఆమెను ప్రోత్సహించారు. దీంతో కాలనీ సభ్యులు తరచూ ఎదుర్కొనే వివక్షను వివరించే పుస్తకాన్ని రాయడంలో మరియు ప్రచురించడంలో ఆమెకు మరింత స్ఫూర్తినిచ్చింది. ఆమె కొడుకు కూడా కేరళ కళామండలంలో చదువుతున్నప్పుడు చేదు అనుభవాలను చవిచూశాడు.

#inspirational-story #tiruvananthapuram #kerala
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe