Lee Sun Kyun Dead : ఆస్కార్‌ విన్నింగ్‌ మూవీ `పారాసైట్ నటుడు సూసైడ్..కారులో డెడ్ బాడీ..!!

ఆస్కార్ విన్నింగ్ మూవీ పారాసైట్ లో అద్భుమైన యాక్టింగ్ తో అందర్నీ మెప్పించిన సౌత్ కొరియన్ నటుడు లీ సన్ క్యూన్ అనుమానస్పద స్థితిలో మరణించాడు. ఆయన వయస్సు 48ఏళ్లు. కారులో డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. ఆయన నటించిన పారాసైట్ మూవీకి 2019లో ఆస్కార్ అవార్డు వరించింది.

New Update
Lee Sun Kyun Dead : ఆస్కార్‌ విన్నింగ్‌ మూవీ `పారాసైట్ నటుడు సూసైడ్..కారులో డెడ్ బాడీ..!!

దక్షిణ కొరియా మొదటి ఆస్కార్ గెలుసుకున్న సినిమా పారాసైట్‌లో(Parasite) ముఖ్యమైన పాత్ర పోషించిన నటుడు లీ సన్ క్యూన్ (Lee Sun Kyun )అనుమానస్పద స్థితిలో మరణించాడు. ఆయన వయస్సు 48 సంవత్సరాలు. అతను కారులో శవమై కనిపించాడు. ఈ వార్త తెలియగానే కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ(Korean Film Industry)లోని ప్రతి ఒక్కరూ షాక్‌లో ఉన్నారు. ఈ కేసును విచారించిన అధికారులు డ్రగ్స్ కేసులో ఉన్న లీ సన్ క్యూన్ మరణాన్ని ధృవీకరించారు. వార్యోంగ్ పార్క్‌లో పార్క్ చేసిన కారులో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి కనిపించాడు.. అతన్ని నటుడు లీ సన్ క్యున్ డెత్‌గా గుర్తించారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో లేఖ రాసి తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడని లీ సన్ క్యూన్ భార్య పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు సమాచారం.

కాగా లీ సన్ ఈ మధ్య కాలంలో బాగా వార్తల్లో నిలిచారు. అక్రమంగా డ్రగ్స్ వాడుతున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన అనుమానస్పద స్థితిలో మరణించడం బాధాకరం. లీసన్ ఈ మధ్య నైట్ క్లబ్ లో డ్రగ్స్ తీసుకుంటున్నారని డ్రగ్స్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. ఇంతలోనే ఆయన మరణ వార్త అభిమానులను శోక సంద్రంలో ముంచింది. 'స్లీప్', 'కాఫీ ప్రిన్స్','ఎ హార్డ్ డే' వంటి చిత్రాలలో తన నటనతో పాపులర్ అయిన అతను ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రం 'పారాసైట్'లో తన ముఖ్యమైన పాత్రకు కూడా పాపులర్ అయ్యాడు. అయితే, లీ సన్ క్యున్ తన రాబోయే ప్రాజెక్ట్‌ల (హాలీవుడ్) నుండి కూడా వైదొలిగాడు.

సౌత్ కొరియాకు చెందిన లీ సన్ క్యూన్ ...అక్కడ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. 1975 మార్చి 2న జన్మించారు. స్టేజ్ యాక్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆయన 2000లో సైకో డ్రామా అనే షార్ట్ ఫిల్మ్ తో కెరీర్ తో పైకి వచ్చారు. ఆ తర్వాత మేక్ ఇడ్ బిగ్ అనే సినిమాత్ సిల్వర్ స్క్రీపైకి అడుపెట్టారు. సెంట్ ఆప్ లవ్, మై మదర్ ది మర్మైడ్, లవ్ సో డివైన్, ఆర్ పాయింట్, అవర్ టౌన్, నైట్ అండ్ డే, సాకా , రొమాంటిక్ ఐలాండ్, పాజు, పెట్టి రొమాన్స్ అనే సినిమాల్లో నటించారు. కాగా పారాసైటమ్ సినిమా 2019లో ఆరు విభాగాల్లో ఆస్కార్ కు పోటీ పడి..నాలుగు అవార్డులు గెలుచుకుని సంచలనం క్రియేట్ చేసింది.

ఇది కూడా చదవండి: బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ ఇవే.. ఇందులో పెట్టుబడి పెడితే ఐదేళ్లలోనే కాసుల వర్షం..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు