SBI Clerk Mains Admit Card Release : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల(Clerk Preliminary Exam Results Released) చేసిన విషయం తెలిసిందే. అర్హత సాధించిన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. ప్రిలిమినరీ పరీక్ష ముగిసిన వెంటనే మెయిన్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును బ్యాంక్ తాజాగా విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా SBI క్లర్క్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మెయిన్స్ పరీక్ష ఎప్పుడంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రిక్రూట్‌మెంట్(SBI E-Recruitment) ద్వారా 8283 జూనియర్ అసోసియేట్(Junior Associate) ఖాళీలను భర్తీ చేస్తుంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 17, 2023న ప్రారంభమై డిసెంబర్ 7న ముగిసింది. ప్రిలిమినరీ పరీక్ష జనవరి 5, 2024 నుంచి జనవరి 12 వరకు జరిగింది. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష(Mains Exam) రాయాలి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4, 2024 వరకు ఈ ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు.
అడ్మిట్ కార్డ్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి:
➼ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ని విజిట్ చేయండి.
➼ దీని తర్వాత కెరీర్ విభాగానికి వెళ్లండి.
➼ జూనియర్ అసోసియేట్స్ విభాగంలో ఇవ్వబడిన లింక్ లేదా క్రింద
ఇవ్వబడిన డైరెక్ట్ లింక్ నుంచి ఫలితాల పేజీకి వెళ్లండి.
➼ మీ రోల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఫిల్ చేయండి. తర్వాత సబ్మిట్ చేయండి.
➼ దీని తర్వాత, అభ్యర్థులు తమ ఫలితాలను స్క్రీన్‌పై చూడగలుగుతారు. అక్కడ ఇచ్చిన లింక్ నుంచి వారి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read : చంద్రబాబుకు బిగ్ షాక్.. ఆ కేసులో A-1గా టీడీపీ అధినేత.. A2, A3 ఎవరంటే?
WATCH: