Heeramandi: 1000 డ్రోన్లు.. కళ్ళు జిగేలుమనేలా.. 'హీరమండి' రిలీజ్ డేట్ రివీల్

స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ వెబ్ సీరీస్ హీరామాండి: ది డైమండ్ బజార్. తాజాగా ఈ సీరీస్ రిలీజ్ తేదీని డ్రోన్ షో ద్వారా స్పెషల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. 1000 డ్రోన్ల తో మూవీలోని అంశాలను ఆకాశంలో ప్రదర్శిస్తూ మే 1న రిలీజ్ కానున్నట్లు తెలిపారు.

Heeramandi: 1000 డ్రోన్లు.. కళ్ళు జిగేలుమనేలా..  'హీరమండి' రిలీజ్ డేట్ రివీల్
New Update

Heeramandi The Diamond Bazaar Movie: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు హీరామాండి: ది డైమండ్ బజార్. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ ప్రధాన పాత్రలు పోషించారు.

Heeramandi The Diamond Bazaar Movie

‘హీరమండి- ది డైమండ్ బజార్ రిలీజ్ డేట్ 

అయితే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. తాజాగా ముంబై లో రిలీజ్ డేట్ కు సంబంధించి నిర్వహించిన ఈవెంట్ లో డ్రోన్ షో ద్వారా స్పెషల్ గా అనౌన్స్ చేశారు. 1000 కంటే ఎక్కువ డ్రోన్లతో సినిమాలోని ముఖ్యమైన అంశాలను, సన్నివేశాలను ఆకాశంలో ప్రదర్శిస్తూ.. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. ఈ సీరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా  ఎంతో గ్రాండ్ గా ఈ షోను నిర్వహించింది నెట్ ఫ్లిక్స్. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Heeramandi The Diamond Bazaar Movie

‘హీరమండి- ది డైమండ్ బజార్ స్టోరీ

స్వాతంత్య్రానికి ముందు అంటే 1940 కాలంలో ‘హీరమండి- ది డైమండ్ బజార్ ప్రాంతంలోని వేశ్యల కథ ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. హీరామండి అనే రెడ్ లైట్ ప్రాంతంలో జీవనం సాగించిన డ్యాన్సర్ల జీవితం గురించి ఈ సీరీస్ లో చూపించబోతున్నారు భన్సాలీ.

Heeramandi The Diamond Bazaar Movie

Heeramandi The Diamond Bazaar Movie

Also Read: Tillu Square Success Meet: టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్.. వైరలవుతున్న ఫొటోలు.. ఓ లుక్కేయండి

#heeramandi #heeramandi-release-date #heeramandi-series
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe