Salaar vs Dunky: బాలీవుడ్ బాద్ షా కు సలార్ టెన్షన్.. గట్టి దెబ్బే!

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ డింకీ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రభాస్ మూవీ సలార్ 22 న రిలీజ్ కాబోతోంది. విదేశాల్లో ఇప్పటికే రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవగా.. షారూక్ సినిమా కంటే ప్రభాస్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

New Update
Salaar vs Dunky: బాలీవుడ్ బాద్ షా కు సలార్ టెన్షన్.. గట్టి దెబ్బే!

Salaar vs Dunky:  బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ ఎవరు అంటే.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ముందుగా చెప్పే పేరు షారూక్ ఖాన్. వరుసగా రెండు సినిమాల హిట్ తో ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు షారూక్. ఇప్పుడు షారూక్ కు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. రెండు సినిమాల హిట్స్ తో ఊపు మీద ఉన్న షారూక్ తాజా సినిమా డింకీతో హ్యాట్రిక్ కొట్టాలని రెడీ అయిపోయాడు. అయితే సరిగ్గా డింకీ రీలీజ్ అయిన మర్నాడే రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సలార్ కూడా విడుదల అవుతోంది. దీంతో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మన దేశంలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్ ఇప్పుడు షారూక్ ని టెన్షన్ పెడుతోంది.

బాలీవుడ్ బాద్ షా గా చెప్పుకునే షారూక్ ఖాన్ కు డింకీ అడ్వాన్స్ బుకింగ్స్ తలనొప్పి తీసుకువస్తున్నాయట. ఎందుకంటే, ప్రభాస్ సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ దూసుకుపోతోంది. ఆస్ట్రేలియా తీసుకుంటే.. అక్కడ సలార్ 119 షోలకు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఈ బుకింగ్స్ లో ఇప్పటివరకూ 69 వేల ఆస్ట్రేలియన్ డాలర్స్ కలెక్షన్ వచ్చింది. మరోవైపు షారూక్ డింకీ కేవలం 57 షోలు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ అయింది. ఈ షోల నుంచి 6 వేల డాలర్లు దాటాడానికి కష్టపడుతొందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

Also Read: రవితేజకు ఓటీటీ దెబ్బ గట్టిగానే తగిలిందట.. ఆ సినిమాలు ఆగిపోయాయా?  

ఇక అమెరికా విషయానికి వస్తే.. సలార్ 1000 కి పైగా షో అడ్వాన్స్ అయింది. వీటి నుంచి హాఫ్ మిలియన్ అంటే 5 లక్షల డాలర్లను రాబట్టింది. అదే షారూక్ డింకీ సినిమా 350 షో లకు కేవలం 50 వేల డాలర్ల వరకూ మాత్రమే వచ్చాయి. ఇంకా సినిమా రిలీజ్ కోసం 10 రోజుల టైమ్ మాత్రమే ఉంది.

ఈ లెక్కలు చూస్తుంటే షారూక్ ఖాన్ టీమ్ టెన్షన్ లో పడిపోతోందట. నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో షారూక్ కు తిరుగులేదు. వారుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రమోట్ చేసినా.. చేయకపోయినా.. డింకీ సినిమాకి కలెక్షన్లు వచ్చిపడిపోతాయని లెక్కలు వేశారు. కానీ, పరిస్థితి అలా కనిపించడం లేదు. సలార్ పోటీలో ఉన్నప్పటికీ దానిని అందరూ లైట్ తీసుకున్నారు. ఎందుకంటే, ప్రభాస్ సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. ఇటీవలి ఆదిపురుష్ కొట్టిన దెబ్బ ఇప్పటికీ ప్రభాస్ అభిమానులు.. ప్రేక్షకులు అసలు మర్చిపోలేకపోతున్నారు. దీంతో ఎంత క్రేజీ ప్రాజెక్ట్ అయినా కానీ, సలార్ బుకింగ్స్ విషయంలో కొంత అపనమ్మకం ఉన్న మాట వాస్తవం. అందులోనూ అదే సమయంలో షారూక్ పోటీకి దిగడంతో పరిస్థితి ఎలా ఉంటుందో అని అనుకున్నారు. కానీ, సీన్ రివర్స్ అయింది.

కానీ.. షారూక్ డింకీ ట్రైలర్ వచ్చాకా.. నెగెటివ్ వైబ్స్ టీం ని కంగారు పెడుతున్నాయి. అటు సలార్ ట్రైలర్ కి కూడా నెగెటివ్ వచ్చినా ఫుల్ యాక్షన్ మూవీ కావడంతో ఇంపాక్ట్ కనిపించలేదు. కానీ, షారూక్ మూవీ మాస్ ని ఆకర్షించేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే రాజ్ కుమార్ హీరానీ సినిమా అంటే బాలీవుడ్ లో క్రేజ్ వేరు.. అతనితో షారూక్ జత కాలవడంతో డింకీ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. మరి సినిమా విడుదల సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో? సలార్ దెబ్బ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా టాలీవుడ్ హీరో బాలీవుడ్ బాద్ షా లెక్కల్లో చికాకులు తెస్తున్నాడనేది ఇండస్ట్రీ టాక్.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు