Sajjala: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చినంత మాత్రాన నిజం గెలిచినట్టా?

చంద్రబాబుకు బెయిల్ పై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబుకు మంజూరు చేసింది మధ్యంతర బెయిల్ మాత్రమేనని, అది కూడా కంటికి శస్త్రచికిత్స చేయించకోవడానికి మాత్రమే ఇచ్చారని అన్నారు. కానీ టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చినంత మాత్రాన నిజం గెలిచినట్టా? అని విమర్శించారు.

Sajjala: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చినంత మాత్రాన నిజం గెలిచినట్టా?
New Update
Sajjala Ramakrishna Reddy comments on chandrababu bail: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు (TDP Chief Chandrababu naidu) బెయిల్ మంజూరు అవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు 52 రోజుల జైలు జీవితం తర్వాత చంద్రబాబు నాయిడు విడుదలవ్వడంతో పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

బయట చెప్పుకోవడానికి కూడా సంకోచించే చర్మ వ్యాధిని ప్రాణాంతకంగా చూపుతూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మంత్రి సజ్జల. చంద్రబాబుకు మంజూరు చేసింది కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమేనని, అది కూడా కంటికి శస్త్రచికిత్స చేయించకోవడానికి మాత్రమే ఇచ్చారని వెల్లడించారు. కానీ, టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చినంత మాత్రాన నిజం గెలిచినట్టా? అని దుయ్యబట్టారు.

Also Read: వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతాం..అచ్చెన్న వార్నింగ్

చంద్రబాబు ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా? లేక విప్లవకారుడా?... అసలిది వేడుకలు చేసుకోవాల్సిన సమయమేనా? అని సజ్జల ప్రశ్నించారు. నాడు అలిపిరి ఘటన జరిగినప్పుడే చంద్రబాబును ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు జైలుకు వెళ్లినా ఎవరూ బాధపడలేదని ఎద్దేవా చేశారు. చికిత్స తర్వాత చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జైల్లో ఉన్నా ఒకటే,  బయట ఉన్నా ఒకటేనని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉంది కాబట్టే అరెస్ట్ చేశారని వెల్లడించారు.

చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. న్యాయం గెలించిందంటూ నినాదాలు చేస్తున్నారు. బాబు ఇజ్ బ్యాక్ అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా..మరో వైపు వైసీపీ నేతలు, మంత్రులు టీడీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం నాలుగు వారాల బెయిల్ మంజూరుకే ఇంత హాడావీడి అవసరమా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు(Ambati), మాజీ మంత్రి కొడాలి నాని(kodali nani), ఇలా వరుస పెట్టి సోషల్ మీడియాలో టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు.

#ap-ex-cm-chandrababu #sajjala-comments-on-chandrababu-naidu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe