/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-03-at-2.47.52-PM.jpeg)
Sarvepalli Post Poll Study: RTV పోస్ట్ పోల్ స్టడీలో సర్వేపల్లి నియోజకవర్గంలో రిజల్ట్స్ ఊహించని విధంగా రాబోతుందని తేలింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy Chandramohan Reddy) వరుసగా 4 సార్లు ఓడిపోయారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి బరిలోకి దిగారు. చివరి నిమిషం వరకు సోమిరెడ్డికి టికెట్ ఇస్తారా, లేదా అన్న ఉత్కంఠ సాగింది. చివరకు ఆయనకే టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. అయితే ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మంచి మెజారిటీతో గెలవబోతున్నారని మా పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. అయితే.. ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీలో ఇక్కడ వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) గెలవబోతున్నారని తేలింది. అయితే.. ఎన్నికల నాటికి ఆ పరిస్థితి మారింది. నియోజకవర్గంలో పరిస్థితి సోమిరెడ్డికి అనుకూలంగా మారింది.