Kamareddy BJP MLA Katipally Venkataramana Reddy: కేవీఆర్.. కాటిపల్లి వేంకట రమణారెడ్డి.. తెలంగాణలో ఈ పేరిప్పుడు సంచలనం. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను పరాజితులను చేసి కామారెడ్డిలో కాషాయ జెండా ఎగరేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. చిత్తశుద్ధి, అంకితభావంతో కూడిన ప్రజాసేవే తన ఈ విజయానికి కారణమయ్యాయంటున్నారు కేవీఆర్. నిస్వార్థ రాజకీయాల కోసం తాను పనిచేస్తున్నానని, అందుకే ప్రజలు తనకు అండగా ఉన్నారని అంటున్నారాయన. కులం, మతం, ప్రాంతం వంటి సంకుచిత భావాలకు అతీతంగా.. ప్రజలు నమ్మకంతో తనకు ఓటు వేసి గెలిపించారని, ఎల్లప్పుడూ ప్రజల సేవకే కట్టుబడి ఉంటానని అంటున్నారు కాటిపల్లి వేంకటరమణారెడ్డి.
రాజకీయ ప్రస్థానం, వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై కాటిపల్లి వేంకట రమణారెడ్డి ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీని రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. ఆర్టీవీ పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. కేవీఆర్తో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూను కింది లింక్ లో చూడండి.