Robotic Surgery: రోబో ఆపరేషన్.. కంపెనీపై కేసు.. ఏమి జరిగిందంటే.. 

రోబోటిక్ సర్జరీ చేసిన ఒక మహిళ తరువాత మృతి చెందింది. దీనికి కారణం రోబో చేతిలోని ఒక పరికరం ఆమె చిన్న ప్రేగును డేమేజ్ చేయడమే అంటూ మృతురాలి భర్త రోబో తయారు చేసిన కంపెనీపై కేసు వేశాడు. ఈ దావాలో 75,000 డాలర్ల పరిహారాన్ని అతను డిమాండ్ చేశాడు. 

New Update
Robotic Surgery: రోబో ఆపరేషన్.. కంపెనీపై కేసు.. ఏమి జరిగిందంటే.. 

Robotic Surgery:  టెక్నాలజీ లేకుండా మనకి ఒక్క పని కూడా పూర్తికాదు. ఇప్పుడు దాదాపు ప్రతి చేతిలో మొబైల్ ఫోన్లు కనిపిస్తాయి. ప్రతి ఇంట్లో టీవీ, ఫ్రిజ్ మరియు ఏసీ-కూలర్ ఉన్నాయి.  వీటిని ప్రజలు వదిలివేయడానికి ఇష్టపడరు. ఈ సాంకేతికత చాలా మందిని ధనవంతులను చేసింది.  ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) వచ్చాకా.. ఇప్పుడు ఈ సాంకేతికత కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతోంది. దీనిలో మనుషులు ఎక్కువ పని చేయనవసరం లేదు, కానీ యంత్రాలు అన్ని పనులూ చేసేస్తాయి. అయితే ఈ సాంకేతికత భవిష్యత్ లో మనకు ఇబ్బందులు తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది. దీనికి సజీవ ఉదాహరణ ఫ్లోరిడాలో కనిపించింది, ఇది ప్రజలను ఆలోచించేలా చేసింది.

ఇక్కడ ఒక వ్యక్తి వైద్య పరికరాల తయారీదారునిపై కేసు పెట్టాడు. తన భార్యకు రోబో ద్వారా పెద్ద ప్రేగు క్యాన్సర్ (Colon Cancer) కోసం చికిత్స చేయిస్తుంటే.. ఆ క్రమంలో రోబో చేతిలోని పరికరం ఒకటి తన భార్య ఇన్నర్ ఆర్గాన్స్ ని గుచ్చిందని.. అది ఆమె మరణానికి దారి తీసిందని పేర్కొంటూ కేసు నమోదు చేశాడు. హార్వే స్లాజర్ అనే వ్యక్తి ఫిబ్రవరి 6న ఇంట్యూటివ్ సర్జికల్ (IS)కి ఈ కేసు దాఖలు చేశాడు. ఈ విషయాన్ని న్యూయార్క్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. 

రోబోట్ చిన్న పేగులో రంధ్రం చేసింది
ఈ కేసులో పేర్కొన్న వివరాల  ప్రకారం, రిమోట్-నియంత్రిత పరికరం అయిన డా విన్సీ రోబోట్‌ను(Robotic Surgery) ఉపయోగించి పెద్దప్రేగు క్యాన్సర్‌కు చికిత్స కోసం సెప్టెంబర్ 2021లో హార్వే భార్య సాండ్రా బాప్టిస్ట్ హెల్త్ బోకా రాటన్ రీజినల్ హాస్పిటల్‌లో (Boca Raton Regional Hospital) ఆపరేషన్ చేయించుకుంది. ఈ రోబోకు సంబంధించి కంపెనీ ఒక ప్రకటన ఇచ్చింది.  అందులో వైద్యులు చేయలేని పనిని ఈ రోబోట్ సులభంగా చేయగలదని పేర్కొంది. రోబో మహిళ చిన్న ప్రేగులలో రంధ్రం చేసిందని, దాని కారణంగా ఆమెకు మరో అదనపు శస్త్రచికిత్స చేయవలసి వచ్చిందని దావాలో పేర్కొన్నారు.

Also Read: మన యూపీఐ ఆ దేశాల్లోనూ అందుబాటులో.. ఎవరికి లాభం అంటే.. 

ఈ ప్రక్రియలన్నిటి తర్వాత, స్త్రీకి కడుపు నొప్పి  కొనసాగింది.  ఈ కాలంలో ఆమెకు జ్వరం కూడా ఎక్కువగా ఉంది. అప్పుడు ఆమె ఫిబ్రవరి 2022 లో మరణించింది.  రోబోట్ (Robot) అంతర్గత అవయవాలను పాడుచేయడానికి కారణమయ్యే ఇన్సులేషన్ సమస్యలను కలిగి ఉందని కంపెనీకి తెలుసు.  అయితే ఈ ప్రమాదాన్ని కంపెనీ బయటకు చెప్పలేదు. ఫలితంగా ఆ మహిళ మరణించింది.

దీంతో ఆ మహిళ భర్త నిర్లక్ష్యం, ప్రోడక్ట్ రెస్పాన్సిబిలిటీ, డిజైన్ లోపం, నష్టాన్ని బహిర్గతం చేయకపోవడం, కన్సార్టియం నష్టం అలాగే, శిక్షాణాత్మక నష్టాల కోసం కంపెనీపై దావా వేశాడు.. ఈ దావాలో $75,000 పరిహారం డిమాండ్ చేశాడు. 

Watch this Interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు