Life Style: కారులో కూర్చున్న వెంటనే ఏసీ ఆన్ చేస్తున్నారా ..? జాగ్రత్త..!

సహజంగా చాలా మంది కారులో కూర్చున్న వెంటనే ఏసీ ఆన్ చేయడం చేస్తుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి హాని అని చెబుతున్నారు నిపుణులు. ముందుగా కారు కిటికీలను క్రిందికి తిప్పి ,లోపలి ఉష్ణోగ్రత చల్లబడి సాధారణ స్థితికి వచ్చే వరకు 5 నిముషాలు వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఏసీని ఆన్ చేయాలి.

New Update
Life Style: కారులో కూర్చున్న వెంటనే ఏసీ ఆన్ చేస్తున్నారా ..? జాగ్రత్త..!

Life Style: సాధారణంగా చాలా మంది కారులో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మొదటగా చేసే పని పని ఎయిర్ కండీషనర్‌ను ఆన్ చేయడం. మండుతున్న వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఏసీలు ఆన్ చేస్తుంటారు. కానీ కారులో కూర్చున్న వెంటనే ఏసీ ఆన్ చేయడం ఆరోగ్యానికి హానీ అని చెబుతున్నారు నిపుణులు.

డస్ట్ ఎలర్జీ ఉన్నవారికి మరింత ప్రమాదం

డస్ట్ ఎలర్జీతో బాధపడేవారికి ఇది అతి పెద్ద ప్రమాదమని చెబుతున్నారు నిపుణులు. కారులో ఎక్కిన వెంటనే ఏసీ ఆన్ చేయకూడదు. ముందుగా కారు కిటికీలను క్రిందికి తిప్పి లోపలి ఉష్ణోగ్రత చల్లబడి సాధారణ స్థితికి వచ్చే వరకు 5 నిముషాలు వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఏసీని ఆన్ చేయాలి. లేదంటే కారు లోపల గాలి పొడిగా ఉండటమే కాకుండా దుమ్ము కూడా నిండి ఉంది. ఇలాంటి గాలిని పీల్చడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఊపిరితిత్తుల పై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అంతే కాదు ఏసీ వెంట్‌ని క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే, దుమ్ము పేరుకుపోయే అవకాశం పెరుగుతుంది. ఇటువంటి కలుషితమైన గాలికి ఎక్కువసేపు గురికావడం వల్ల తుమ్ములు, అలెర్జీలు, ముక్కు, గొంతులో పొడిబారడం, ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి సమస్యలు వస్తాయి.

publive-image
వాహనంలోని గాలి నాణ్యత కూడా మీరు వాడుతున్న కారు బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. "ప్రీమియం వాహనాలు క్లీనర్ వెంట్స్, డస్ట్-రెసిస్టెంట్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. అయితే సాధారణ కారు మోడల్‌లలో, ఎయిర్ కండీషనర్ ఆన్‌లో ఉన్నప్పుడు రసాయనాలు విడుదలయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి కారు ఉన్నవారు కారు వెంటిలేషన్ నాళాలు క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.

Also Read: Diabetes: మధుమేహ రోగులు ఈ సమయంలో వ్యాయామం చేయడం ఉత్తమం..?

Advertisment
Advertisment
తాజా కథనాలు