AP: సరసమైన ధరలో నాణ్యమైన సరుకులు: ఎమ్మెల్యే

కూటమి ప్రభుత్వం ప్రజలకు నిత్యవసరాల ధరల భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోందన్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. మిల్లర్లతో మాట్లాడి బియ్యం, కందిపప్పు మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

New Update
AP: సరసమైన ధరలో నాణ్యమైన సరుకులు: ఎమ్మెల్యే

MLA Daggubati Prasad : ధరల నియంత్రణే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. ప్రస్తుతం నిత్యవసర ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో ప్రజలపై ఆ భారాన్ని కొంతైనా తగ్గించాలన్న ఉద్దేశంతో సన్న రకం బియ్యం, కందిపప్పు తక్కువ ధరకు అందిస్తున్నట్లు వివరించారు.

Also Read: పార్టీ నాకు ద్రోహం చేసింది.. కన్నీరు పెట్టుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే.!

రైతు బజార్ లో తక్కువ ధరకే నిత్యవసర సరుకులు అందిస్తున్న కేంద్రాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, పౌరసరఫరాల శాఖ అధికారులు కమిషనర్ తో కలిసి ప్రారంభించారు. కందిపప్పు, బియ్యం నాణ్యతను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సంక్షేమ పథకాలే కాకుండా ప్రజలకు నిత్యవసరాల ధరల భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోందన్నారు.

ఇందులో భాగంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మిల్లర్లతో మాట్లాడి బియ్యం, కందిపప్పు మార్కెట్ ధర కన్నా తక్కువకు  అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అండగా ఉండేందుకు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు