Ria Chakravarthi: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ ఓ సంచలనం. ఆయన మరణించి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు. సుశాంత మరణానికి అతని ప్రేయురాలు రియా చక్రవర్తే కారణం అని సుశాంత తండ్రి ఫిర్యాదు చేయడంతో ఎన్సీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రియాతోపాటు ఆమె సోదరుడిని కూడా అరెస్టు చేసింది. అయితే, ప్రస్తుతం ఆమె బెయిల్ మీద బయటికొచ్చింది. అంతే కాకుండా కెరీర్ పరంగా బిజీగా ఉంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో సుశాంత్ సింగ్ ఆత్మహత్మపై ఆసక్తికర విషయాలు వెల్లిడించారు.
పూర్తిగా చదవండి..సుశాంత్ సింగ్ సూసైడ్ కు కారణం అదే..! ప్రియురాలు రియా సంచలన వ్యాఖ్యలు..!!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ పై అతని ప్రియురాలు కీలక వ్యాఖ్యలు చేసింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతుండే వాడని చెప్పింది. సుశాంత్ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి తన లైఫ్ మారిపోయిందని తెలిపింది. సుశాంత్‌కు డ్రగ్స్ సరఫరా చేశారా? అన్న ప్రశ్నకు ఈ విషయం గురించి తాను మాట్లాడదలచుకోలేదు అని సమాధానమిచ్చింది. అయితే, సుశాంత్ సింగ్ మరణించి ఇప్పటికీ మూడేళ్లు గడుస్తున్నా ఆ కేసు మాత్రం ఓ కొలిక్కి రాలేదు.
Translate this News: