Ria Chakravarthi: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ ఓ సంచలనం. ఆయన మరణించి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు. సుశాంత మరణానికి అతని ప్రేయురాలు రియా చక్రవర్తే కారణం అని సుశాంత తండ్రి ఫిర్యాదు చేయడంతో ఎన్సీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రియాతోపాటు ఆమె సోదరుడిని కూడా అరెస్టు చేసింది. అయితే, ప్రస్తుతం ఆమె బెయిల్ మీద బయటికొచ్చింది. అంతే కాకుండా కెరీర్ పరంగా బిజీగా ఉంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో సుశాంత్ సింగ్ ఆత్మహత్మపై ఆసక్తికర విషయాలు వెల్లిడించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/2-5-1-jpg.webp)
'‘సుశాంత్ మానసిక ఆరోగ్య సమస్యల గురించి తనకు తెలుసని.. అతడు మానసిక అనారోగ్యంతో బాధపడుతుండే వాడని చెప్పింది. సుశాంత్ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి తన లైఫ్ మారిపోయిందని.. అయితే అతను అంతకుముందే బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకోవడంతో అతన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం తానేప్పుడూ చేయలేదని చెప్పింది. ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగాడని పేర్కొంది. సుశాంత్‌కు డ్రగ్స్ సరఫరా చేశారా? అన్న ప్రశ్నకు ఈ విషయం గురించి తాను మాట్లాడదలచుకోలేదు అని సమాధానమిచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ss-2-jpg.webp)
సుశాంత్ సన్నిహిత స్నేహితురాలిగా ఆయన మరణం తనకు తీరని లోటని చెప్పారు. సుశాంత్ లేకుండా జీవించడం చాలా కష్టమని అన్నారు. అయితే, మనమంతా మనుషులం కాబట్టి ముందుకు సాగక తప్పదని రియా చక్రవర్తి వేదాంత ధోరణిలో మాట్లాడారు. సుశాంత్ మరణించిన తర్వాత జరిగిన సంఘటనల గురించి ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో తనకు మనసులో బాధను దించుకునేలా ఏడ్చేందుకు కూడా సమయం దొరకనీయలేదని అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/h-jpg.webp)
ఆప్తుడిని పోగొట్టుకున్న బాధ ఓవైపు, మీడియాలో తనను విలన్ గా చూపిస్తున్న బాధ మరోవైపు.. ఇలా చుట్టూ సమస్యలతోనే సతమతమయ్యానని వివరించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని రియా చెప్పారు. ఆ విషాదం నుంచి కోలుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని వివరించారు. తన తండ్రి భారత సైన్యంలో పనిచేశారని, ఎన్ని కష్టాలు ఎదురైనా కుంగిపోవద్దని, మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండాలని చెప్పారని తెలిపారు. ఆ మాటలను గుర్తు తెచ్చుకుంటూ ధైర్యంగా నిలబడ్డానని రియా పేర్కొన్నారు.
Also Read: రోజాకు నేనున్నా..బండారుపై విరుచుకుపడిన నటి రాధిక..!!
సుశాంత్ సింగ్ సూసైడ్ కు కారణం అదే..! ప్రియురాలు రియా సంచలన వ్యాఖ్యలు..!!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ పై అతని ప్రియురాలు కీలక వ్యాఖ్యలు చేసింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతుండే వాడని చెప్పింది. సుశాంత్ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి తన లైఫ్ మారిపోయిందని తెలిపింది. సుశాంత్‌కు డ్రగ్స్ సరఫరా చేశారా? అన్న ప్రశ్నకు ఈ విషయం గురించి తాను మాట్లాడదలచుకోలేదు అని సమాధానమిచ్చింది. అయితే, సుశాంత్ సింగ్ మరణించి ఇప్పటికీ మూడేళ్లు గడుస్తున్నా ఆ కేసు మాత్రం ఓ కొలిక్కి రాలేదు.