Revanth vs KTR: మీ పని ఖతం.. కేటీఆర్‌, రేవంత్‌ మధ్య ట్వీట్ వార్‌.. అసలేంటి గొడవ??

కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంట్‌ కూడా ఇవ్వడం లేదంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కౌంటర్ ట్వీట్ వేశారు. కాంగ్రెస్‌ సునామి చూసి కేటీఆర్‌కు ఫేక్‌ ప్రచారాలకు దిగారన్నారు రేవంత్‌. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని చెప్పారు.

New Update
Revanth vs KTR: మీ పని ఖతం.. కేటీఆర్‌, రేవంత్‌ మధ్య ట్వీట్ వార్‌.. అసలేంటి గొడవ??

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రత్యర్థులు బహిరంగ సభల్లోనూ, చిట్‌చాట్లలోనే కాదు సోషల్‌మీడియాలోనూ మాటల దాడికి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని మరింత రంజుగా మార్చుతున్నారు. తెలంగాణలో టాప్‌ లీడర్లలో ఒకరైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth reddy), మంత్రి కేటీఆర్‌(KTR) మరోసారి ట్విట్టర్‌ వేదికగా వార్‌కి దిగారు. కాంగ్రెస్‌ని విమర్శస్తూ ముందుగా కేటీఆర్‌ ట్వీట్ వేయగా.. దానికి రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ట్వీట్ వేశారు. ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌కు రేవంత్‌ వార్నింగ్‌ ఇవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది


అసలేంటి గొడవ?
కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంట్‌ సరిగ్గా ఇవ్వడం లేదంటూ మంత్రి కేటీఆర్‌ మొదట ట్వీట్ చేశారు. రైతులు ఆందోళన చేస్తున్నారంటూ ట్వీట్‌లో విమర్శించారు. కేటీఆర్‌ ట్వీట్‌పై రేవంత్‌రెడ్డి స్పందించారు. బీజేపీ దగ్గర శిష్యరికంతో కేటీఆర్‌ ఫేక్‌ ప్రచారాల్లో రాటుదేలారంటూ రేవంత్‌ కౌంటర్ ట్వీట్ వేశారు. కాంగ్రెస్‌ సునామి చూసి కేటీఆర్‌కు ఫేక్‌ ప్రచారాలకు దిగారన్నారు రేవంత్‌. బీఆర్‌ఎస్‌ మిత్రపక్షమైన బీజేపీ కర్ణాటకలో 40 శాతం కమీషన్లతో రాష్ట్రాన్ని దివాలా తీయించిందన్నారు రేవంత్‌. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని చెప్పారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుస్తుందని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు.


నిరసనలు చేస్తున్న బీజేపీ:
కర్ణాటకలో కాంగ్రెస్‌ అక్రమాలు చేస్తుందంటూ మరోవైపు బీజేపీ నిరసనలకు దిగుతోంది. ఇటీవలి ఆదాయపు పన్ను శాఖ దాడులు అక్కడి రాజకీయాల్లో కలకలం రేపాయి. రూ.42 కోట్లతో సహా కొంతమంది వ్యక్తుల నుంచి రూ.94 కోట్ల నగదును అధికారులు స్వాధినం చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ అక్కడి బీజేపీ నిరసనలకు దిగుతోంది. మరోవైపు కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంట్ కూడా సరిగా ఇవ్వడం లేదంటూ పలు చోట్ల రైతులు నిరసన బాట పడుతున్నారు.

Also Read: వచ్చే ఎన్నికల్లో `మోదీ గ్యారంటీలు’ అక్కరకు వస్తాయా?

Advertisment
తాజా కథనాలు