Jagan : తాడేపల్లి ప్రజలకు తీరిన దారి కష్టాలు!

తాడేపల్లిలో ప్రజలకు దారి కష్టాలు తీరిపోనున్నాయి.జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో ఆయన ఇంటి వెనకు నుంచి ఎటువంటి రాకపోకలు జరగకుండా పోలీసులు కట్టడి చేశారు.ఆ ప్రాంత వాసులు పడుతున్న ఇబ్బందుల గురించి కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి స్పందించింది.

Jagan : తాడేపల్లి ప్రజలకు తీరిన దారి కష్టాలు!
New Update

Removed Barricades On Tadepalle Routes : తాడేపల్లి (Tadepalle) లో ప్రజలకు దారి కష్టాలు తీరిపోనున్నాయి. జగన్‌ (YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన ఇంటి వెనకు నుంచి ఎటువంటి రాకపోకలు జరగకుండా పోలీసులు కట్టడి చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, కట్ట దిగువనున్న మార్గాల పై ఇంతకు ముందు రాకపోకలు ఆపేశారు.

ఆ మార్గాల్లో బారికేడ్లు (Barricades) పెట్టి మరీ ఆపేశారు. దీంతో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువకట్ట మార్గంలో వెళ్లేవారు 1.5 కిలోమీటర్లు అదనంగా తిరిగి వెళ్లాల్సి వచ్చేది. ఆ ప్రాంత వాసులు పడుతున్న ఇబ్బందుల గురించి కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి స్పందించింది.

ఆ మార్గాల్లో బారికేడ్లు తొలగించింది. రహదారికి రెండు వైపులా పోలీసు చెక్‌పోస్టులు ఉంచి.. ప్రజల రాకపోకలకు ఆదివారం రాత్రి నుంచి అనుమతినిచ్చింది.

Also read: ఘోర ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ

#barricades #tadepalli #ys-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe