లవ్‌లో ఉన్నప్పుడు ప్రతీ విషయాన్ని మన పార్టనెర్‌తో షేర్ చేసుకుంటాం. ఇది దాదాపుగా అందరూ చేసేదే. మన పర్శనల్ విషయాలు కూడా చెబుతుంటాం. అయితే లవర్ దగ్గర అసలు మాట్లాడకూడని టాపిక్స్ ఉంటాయి. అవి మాట్లాడితే లేనిపోని గొడవలు వస్తాయి. అసలు ఏం మాట్లాడాలి.. ఏం మాట్లాడకూడదు అన్నది చాలా మందికి తెలియదు. అందుకే తొందరపడి తోచింది మాట్లాడేస్తుంటారు. కానీ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు అసలు చర్చింకపోతేనే మంచిది.. అవేంటో తెలుసుకోండి.
గత సంబంధాలు: గత శృంగార సంబంధాల గురించి ప్రత్యేకంగా చర్చించవద్దు. కొంతమంది తెలియక వీటిని కూడా వివరంగా చర్చిస్తుంటారు. ఇది మీ లవర్‌కి అసలు నచ్చకపోవచ్చు. కొన్నిసార్లు అసూయ లేదా అభద్రతకు దారితీయవచ్చు.
మాజీ లవర్స్: మీ మాజీ భాగస్వామిని తరచుగా మీ మాటల్లో తీసుకురావడం లేదా మీ ప్రస్తుత భాగస్వామిని వారితో పోల్చడం కరెక్ట్ కాదు. ఎవరి యూనిక్‌నెస్ వారికి ఉంటుంది. పదేపదే పాత లవర్ గురించి కొత్త లవర్ దగ్గర మాట్లాడొద్దు.
ఆర్థిక సమస్యలు: డబ్బు ఒత్తిడికి మూలం. ఎక్కువసార్లు ఆర్థిక సమస్యల గురించి చర్చించడం అంత మంచిది కాదు. ఆర్థిక విషయాలపై నిరంతరం దృష్టి పెట్టడం ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ విషయాలను మీ లవర్‌తో చర్చించడం చికాకు కలిగించవచ్చు. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడే ఈ టాపిక్ తియ్యండి.
కుటుంబ కలహాలు: మీ ఫ్యామిలీ గొడవలను మీ లవర్‌తో చర్చిస్తే అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే లవ్ తర్వాత పెళ్లీ చేసుకుంటారన్న విషయం తెలుసు కదా.. ఆ సమయంలో మీ ఇద్దరి జీవితం కూడా గొడవలతో ఉంటుందేమోనన్న అనుమానం మీ లవర్‌కు రావొచ్చు..
వివాదాస్పద అంశాలు: మతం, రాజకీయాలు లేదా ఇతర వివాదాస్పద అంశాల జోలికి పోవద్దు. ఆరోగ్యకరమైన చర్చలు మంచిగానే ఉన్నప్పటికీ.. మీ నమ్మకాలను మీ లవర్‌పై నెట్టడం మానుకోండి. ఎవరికి నచ్చినట్లుగా వారిని ఉండనివ్వాలి. కానీ తప్పు చేస్తున్నారని అనిపిస్తే మాత్రం మంచిగా మాట్లాడి సరిదిద్దండి.
పోలిక: మీ లవర్‌ని ఇతరులతో నిరంతరం పోల్చడం మానుకోండి. ఇది వారికి కోపం తెప్పించవచ్చు. లవర్‌ని స్పెషల్‌గానే చూడాలి కానీ ఇతరులతో పోల్చి కాదు.
స్నేహితులు: మీ లవర్ ఫ్రెండ్స్‌ని అసలు తిట్టవద్దు. ఏదైనా తప్పు ఉన్నా చెప్పాల్సిన విధంగా చెప్పాలి. అంతేకానీ అదేపనిగా మీ లవర్ స్నేహితులను విమర్శించడం లేదా వారిపై ఫిర్యాదు చేయడం వల్ల మీ ఇద్దరికి గొడవలు వస్తాయి.
Also Read: Beauty Tips: ఈ చిన్న చిట్కా మీ కళ్ల అందాన్ని మరింత పెంచుతుంది.. అదేంటో తెలుసుకోండి! - Rtvlive.com