Buying Tips: సమ్మర్ లో ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరకే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లిస్ట్ ఇదే..!!

ఈ వేసవిని కూల్ గా మార్చుకోవాలనుకుంటున్నారా? ఈ సమ్మర్ లో ఫ్రిడ్జ్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే వెంటనే త్వర పడండి. ఎండలు పెరుగుతున్నా కొద్దీ ధరలు భగ్గుమంటుంటాయ్. తక్కువ ధరకే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ బెస్ట్ ఫ్రిడ్జ్ ఆప్షన్లపై ఓ లుక్కేయండి.

Buying Tips: సమ్మర్ లో ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరకే  డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లిస్ట్ ఇదే..!!
New Update

Buying Tips: నేటికాలంలో దాదాపు అందరి ఇళ్లలోనూ రిఫ్రిజిరేటర్లు ఉండటం సాధారణమే. రిఫ్రిజరేటర్లు లేకుండా పనిచేయడం కష్టం అనేంతగా మారిపోయింది కాలం. అయితే మారిన పరిస్థితుల కారణంగా ఫ్రిజ్ లను కొత్త టెక్నాలజీ, సైజ్ లకు అప్ గ్రేడ్ చేస్తున్నాయి కంపెనీలు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మన్నికైన, బడ్జెట్ కు అనుకూలమైన బెస్ట్ ఫ్రిజ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? వచ్చేది వేసవి కాలం...పాత ఫ్రిజ్ తీసేసి కొత్త ఫ్రిజ్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలను ఓ సారి తెలుసుకోండి.

బెస్ట్ ఎల్జీ రిఫ్రిజిరేటర్ డబుల్ డోర్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:

ఆన్‌లైన్‌లో మల్టిపుల్ ఛాయిస్, లేటేస్ట్ టెక్నాలజీ ఫీచర్‌లతో అనేక రిఫ్రిజిరేటర్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో టాప్ 5 లిస్టును ఇప్పుడు చూద్దాం. ఈ ఎల్జీ ఫ్రిడ్జ్ డబుల్ డోర్ దాని లేటెస్ట్ టెక్నాలజీ , అధునాతన ఫీచర్లతో ప్రతి ఇంట్లోనూ కొత్త వాతావరణాన్ని తీసుకువస్తుంది.

1. ఎల్జీ 322ఎల్ స్మార్ట్ ఇన్వర్టర్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ :

ఈ LG రిఫ్రిజిరేటర్ ఫ్రాస్ట్-ఫ్రీ ఫీచర్‌తో వస్తుంది. ఇది 3 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో అందుబాటులో ఉంది. 300 లీటర్ల కంటే ఎక్కువ కెపాసిటీ కలిగిన ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్... ఐస్ గడ్డకట్టకుండా ఉండేందుకు ఆటో డీఫ్రాస్ట్ ఫంక్షన్‌ ఆప్షన్ కూడా ఉంది.

ఇది ఫ్రీజర్ 81 లీటర్లు. తాజా ఆహారం కోసం 241 లీటర్ల కెపాసిటితోపాటు కూరగాయల బాక్స్ కోసం 28 లీటర్ల కెపాసిటి ఉంది. ఈ ఎల్జీ రిఫ్రిజిరేటర్ యాంటీ బాక్టీరియల్ రబ్బరు పట్టీతో వస్తుంది. ఇది బ్యాక్టీరియా, దుమ్ము నుండి ఆహారాన్ని రక్షిస్తుంది. ఈ ఎల్జీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ధర: రూ. 36490.

2. ఎల్జీ 360 ఎల్3 స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ :

ఈ ఫ్రిడ్జ్ లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా 5స్టార్ కు 4.3రేటింగ్ ఇచ్చారు. ఈ ఫ్రిడ్జ్ కెపాసిటి 360 లీటర్లు. ఇన్వర్టర్ లీనియర్ కంప్రెసర్ టెక్నాలజీ కారణంగా రిఫ్రిజిరేటర్ డబుల్ డోర్ కంప్రెసర్ నుండి ఫ్రీజర్ వరకు చాలా చల్లగా ఉంటుంది. రిఫ్రిజిరేటర్ ధర: రూ. 42990.

3. ఎల్జీ 242 ఎల్3 స్టార్ స్మార్ట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ :

300 లీటర్ల కంటే తక్కువ ఉన్న ఫ్రాస్ట్-ఫ్రీ రిఫ్రిజిరేటర్‌లు ఐస్ గడ్డకట్టకుండా ఆటో డీఫ్రాస్ట్ ఫంక్షన్‌ను కలిగి ఉంటాయి. ఈ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌లో మీరు 242 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. ఇది పెద్ద కుటుంబానికి బెస్ట్ ఆప్షన్. వాటర్ బాటిళ్లను 2 లీటర్ల వరకు ఉంచడానికి సైడ్ షెల్ఫ్ ఉంది. ధర: రూ. 25990.

4. ఎల్జీ 264 ఎల్ 2 స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ :

ఎల్జీ రిఫ్రిజిరేటర్ డియోడరైజర్ ఫీచర్ సహాయంతో ఫ్రిజ్ మొత్తం తాజాగా ఉంటుంది. మల్టీ ఎయిర్ ఫ్లో టెక్నాలజీ మీ ఆహారాన్ని తాజాగా ఉంచుతుంది. స్టోరేజీ కోసం డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లో 23 లీటర్ల కెపాసిటీ ఉన్న వెజిటబుల్ బాక్స్, 2 లీటర్ వాటర్ బాటిల్ కోసం స్థలం ఉంటుంది. రూ. 27990.

ఇది కూడా చదవండి: గద్దెనెక్కిన సారలమ్మ.. రేపు చిలుకలగుట్ట నుంచి తరలిరానున్న సమ్మక్క!

#buying-tips #refrigerators
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe