/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Recipe-Simple-steps-to-prepare-Lychee-fruit-icecream-at-home-.jpg)
Lychee Fruit Ice cream: పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఐస్ క్రీం తినడానికి ఇష్టపడతారు. మార్కెట్ లో వివిధ ఫ్లెవర్స్ కలిగిన ఐస్ క్రీమ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిని తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుందనే భయం ఉంటుంది. అలాంటప్పుడు కావాలంటే ఇంట్లోనే రుచికరమైన ఐస్ క్రీం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్టీ, హెల్తీ లిచీ ఫ్రూట్ ఐస్‌క్రీమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
లిచీ ఐస్ క్రీం తయారీకి కావలసిన పదార్ధాలు:
2 కప్పులు తాజా లిచీ
1 కప్పు కండెన్స్‌డ్ మిల్క్
1 కప్పు ఫుల్ క్రీమ్ మిల్క్
1 కప్పు హెవీ క్రీమ్
1/2 కప్పు చక్కెర
1 టీస్పూన్ వెనిలా ఎసెన్స్
లిచీ ఐస్‌క్రీం తయారీ విధానం:
- లిచీ ఐస్ క్రీం చేయడానికి, ముందుగా లిచీ ప్యూరీని తయారు చేసుకోవాలి. దీని కోసం, ముందుగా లిచీని బాగా కడగాలి. తర్వాత దానిపై తొక్క, విత్తనాలను తొలగించండి. ఇప్పుడు మిక్సర్ గ్రైండర్‌లో లిచీ పండ్లను వేసి ప్యూరీలా చేయండి. మరీ మెత్తగా కాకుండా లిచీ ముక్కలు నోటికి తగిలేలా గ్రైండ్ చేయాలని గుర్తుంచుకోవాలి. ఇది ఐస్ క్రీంకు మంచి ఆకృతిని ఇస్తుంది.
- ప్యూరీ తయారు చేసిన తర్వాత.. ఒక పెద్ద గిన్నెలో కండెన్స్‌డ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్, చక్కెర కలపాలి. దీని తరువాత ఈ గిన్నెలో లిచీ ప్యూరీని వేసి బాగా కలపాలి. నెమ్మదిగా మిక్సింగ్ చేస్తూ లిచీ మిశ్రమానికి పైన మిక్స్ చేసి ఉంచిన కండెన్స్‌డ్ మిల్క్, ఫుల్‌క్రీమ్ మిల్క్, చక్కెర మిశ్రమాన్ని యాడ్ చేయాలి. క్రీమ్ కలుపుతున్నప్పుడు దానిని కొట్టవద్దు, మెత్తగా కలపాలి.
- చివరగా ఈ మిశ్రమంలో వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల ఐస్‌క్రీమ్‌కు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో పోసి కనీసం 6-8 గంటలు లేదా రాత్రిపూట ఫ్రీజ్ చేయాలి. బయటకు తీసినప్పుడు ఐస్ క్రీంపై లిచీ పల్ప్ వేసి సర్వ్ చేయాలి. ఈ లిచీ ఐస్ క్రీం తినడానికి చాలా రుచిగానూ, ఆరోగ్యానికి ఆరోగ్యకరంగానూ ఉంటుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.