Car Blast: ఈ చిన్న వస్తువులే.. మీ కారును పేల్చేస్తాయి..? జాగ్రత్త..!

కార్లు అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనలు తరచూ వింటూనే ఉంటాము. కారులో ఉంచే కొన్ని వస్తువులే దీనికి కారణమని చెబుతున్నారు నిపుణులు. ప్లాస్టిక్ బాటిల్స్, శానిటైజర్స్ కారులో అస్సలు ఉంచవద్దు. ఇవి సూర్యరశ్మికి నేరుగా గురైనప్పుడు మంటలు చెలరేగి కారు బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది.

New Update
Car Blast: ఈ చిన్న వస్తువులే.. మీ కారును పేల్చేస్తాయి..? జాగ్రత్త..!

Car Blast:  కారు అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనలు తరచూ వింటూనే ఉంటాము. తీవ్రమైన వేడి, షార్ట్ సర్క్యూట్ కారణంగా కారు బ్లాస్ట్ అయిన సంఘటనలు ఇప్పటికే పలు చోట్ల జరిగినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇవి మాత్రమే కాదు కార్లు బ్లాస్ట్ అవ్వడానికి కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఇవి భవిష్యత్తులో పెద్ద పెద్ద ప్రమాదాలకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

ప్లాస్టిక్ బాటిల్స్

సాధారణంగా కారులో నీళ్లు తాగేందుకు ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తుంటాం. ఆ తాగిన బాటిల్స్ కొన్ని రోజుల వరకు కారులో అలాగే పడి ఉంటాయి. కానీ ఈ చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ కారులో పెద్ద ప్రమాదానికి కారణమయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వేసవిలో కారు లోపల ప్లాసిక్ బాటిల్స్ అస్సలు ఉంచకూడదు. కారులోని బాటిల్స్ నేరుగా సూర్యరశ్మికి గురైనప్పుడు బాటిల్ లో మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. ఆ మంటలు వాహనమంతటా వ్యాపించి కారు బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది.

ఈ విషయాలను కూడా నివారించండి

  • ప్లాస్టిక్ బాటిల్స్ మాత్రమే కాదు కారులో ఉంచకూడని వస్తువులు ఇంకా చాలా ఉన్నాయి. సిగరెట్ వెలిగించడానికి లైటర్ ఉపయోగించేవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కారులో లైటర్‌ను ఎప్పుడూ ఉంచవద్దు. నిజానికి లైటర్‌పై సూర్యరశ్మి పడితే అది పెద్ద పేలుడుకు కారణమవుతుంది. దీని కారణంగా వాహనంలో తీవ్రమైన మంటలు సంభవించవచ్చు.

publive-image

  • అంతేకాదు సువాసన కోసం కారులో డియోడరెంట్‌ను పెడుతుంటారు చాలా మంది.కానీ ఇవి టెంపరేచర్ సెన్సిటివ్. టెంపరేచర్ కాస్త పెరిగిన పేలిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల కారులో ప్రయాణించే వారికి చాలా ప్రమాదం.
  • కారులో పొరపాటున కూడా శానిటైజర్ ఉంచవద్దు. వాహనంలో శానిటైజర్ ఉంచడం వల్ల కూడా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇవి సూర్యరశ్మికి నేరుగా గురైనప్పుడు మంటలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ మంటలు కారు అంతటా వ్యాపించి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
  • అలాగే వాహనంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని సందర్భాల్లో వీటి వల్ల కూడా కారులో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనలు వేసవిలో జరిగే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Also Read: Parenting Guide: న్యూ బోర్న్ పేరెంట్స్ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు