Good Friday: గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు? యేసును సిలువ వేయడానికి కారణం ఏమిటి?

అసలు క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు? యేసును సిలువ వేయడానికి కారణం ఏమిటి? యేసు ఎక్కడ సిలువ వేయబడ్డారు? యేసుక్రీస్తు శిలువ మీద శిక్షను పొందేటప్పుడు ఆయన పలికిన ఏడు మాటలు ఏంటీ..? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Good Friday: గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు? యేసును సిలువ వేయడానికి కారణం ఏమిటి?

Good Friday: గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాము..

క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?

క్రైస్తవులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గుడ్ ఫ్రైడే ఒకటి. యేసుక్రీస్తు శిలువ వేయబడిన రోజున గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే అంటే యేసు మరణించిన రోజు. అయితే ఆ రోజును యేసుక్రీస్తు శిలువ మీద శిక్షను పొందేటప్పుడు ఏడు మాటలు పలికారని చెబుతుంటారు. ఆ ఏడు మాటలను గుడ్ ఫ్రైడే రోజున ప్రతీ ఒక్క క్రెస్తవుడు ఖచ్చితంగా గుర్తుచేసుకుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

యేసు పలికిన ఏడు మాటలు

మొదటి వాఖ్యం :  తండ్రీ వీరేమి చేయుచ్చున్నారో.. వీరెరుగరు గనుక వీరిని క్షమించు
రెండవ వాఖ్యం :  నేడు నీవు నాతో పాటు పరదైసులో ఉందువు
మూడో వాఖ్యం :  ఓ తల్లీ నీ కొడుకు పరిస్థితి చూడు.
నాల్గవ వాఖ్యం:  నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావు?
ఐదో వాఖ్యం :  దాహం వేస్తోంది.
ఆరో వాఖ్యం :  సమాప్తమైనది
ఏడో వాఖ్యం :  గట్టిగా కేక వేస్తూ.. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి ప్రాణము విడిచారు.

Good Friday

యేసును సిలువ వేయడానికి కారణం ఏమిటి?

విశ్వాసం ప్రకారం, యేసు ప్రవక్తత్వాన్ని కలిగి ఉండడం యూదులలో అతని పై ద్వేషాన్ని కలిగించింది. ప్రవక్త అంటే ఒకరి ప్రవక్తత్వం గురించి మాట్లాడటం. యేసు తనను తాను దేవుని బిడ్డనని చెప్పుకోవడం యూదు ఛాందసవాదులకు నచ్చదు.అంతే కాదు ప్రభు బోధనలు వినేందుకు ఎంతో మంది ఆసక్తి చూపించేవారు.ఇలా ప్రజలందరూ యేసుక్రీస్తు మాటలకు ప్రభావితమవుతున్నారని భావించిన రోమీయులు ఆయన పై కక్షగడతారు. ఎలాగైనా ఆయన్ను అణిచివేయాలని భావిస్తారు.

ఇందుకు యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు రోమా సైనికులకు సహాయం చేస్తాడు. అతడికి డబ్బు పై ఉన్న ఆశతో ఇలా చేస్తాడు. యూదుల రాజుగా తనని తాను ప్రకటించుకున్నాడని అబద్ధపు నిందను మోపి యేసుక్రీస్తుని రోమా సైనికులకు అప్పగిస్తాడు. ఇస్కరియోతు చేసే ద్రోహం గురించి యేసుకు ముందే తెలుసు. అయినప్పటికీ ప్రజలను పాపాల నుంచి రక్షించడం కోసం ప్రాణత్యాగం చేయాలని తన కర్తవ్యంగా భావించారు యేసు.

యేసుక్రీస్తు శిలువ వేయబడిన ప్రదేశం 

యేసుక్రీస్తు శిలువ వేయబడిన ప్రదేశాన్ని గోల్గోతా అని పిలుస్తారు. గుడ్ ఫ్రైడే పండుగను క్రైస్తవ సమాజం బ్లాక్ డేగా జరుపుకుంటుంది. దీనిని బ్లాక్ ఫ్రైడే, హోలీ ఫ్రైడే మొదలైన పేర్లతో పిలుస్తారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: High BP: ఈ ఒక్క అలవాటుతో మీ అధిక రక్తపోటు ప్రమాదం 40శాతం తగ్గుతుంది!

Advertisment
Advertisment
తాజా కథనాలు