Razakar movie: 'రజాకార్‌' సినిమా బ్యాన్‌? ముదురుతున్న వివాదం..!

'రజాకార్‌' మూవీని నిషేధించాలని బీఆర్‌ఎస్‌ వాదిస్తుండగా.. ఎందుకు బ్యాన్‌ చేయాలో చెప్పాలని బీజేపీ కౌంటర్‌ అటాక్ చేస్తోంది. రజాకార్‌ మూవీ గురించి సెన్సార్‌ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలన్న కేటీఆర్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టారు ఎమ్మెల్యే రాజాసింగ్‌. నిజాం హయాంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎంతమందిని చంపాడో మీ నాన్న చెప్పలేదా అని ప్రశ్నించారు. అటు చిల్లర సినిమా తీస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ బిహేవ్‌ చేస్తుందని కేటీఆర్‌ ఫైర్ అయ్యారు.

New Update
Razakar movie: 'రజాకార్‌' సినిమా బ్యాన్‌? ముదురుతున్న వివాదం..!

Razakar movie ban? 'రజాకార్‌'(Razakar) మూవీపై వివాదం అంతకంతకూ ముదురుతోంది. ఈ గొడవ అటు తిరిగి ఇటు తిరిగి రాజకీయ పార్టీల మధ్య ఫైట్‌గా మారుతోంది. మానిన గాయాలను రెచ్చగొట్టేందుకే బీజేపీ ఈ సినిమాను ప్రమోట్ చేస్తుందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపిస్తుండగా.. దీనిపై బీజేపీ మండిపడుతోంది. రజాకార్‌ చిత్రానికి సంబంధించిన వ్యవహారాన్ని సెన్సార్‌ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌(KTR) తీసుకున్న నిర్ణయంపై గోషామహల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే, సస్పెన్షన్‌కు గురైన బీజేపీ నేత రాజాసింగ్‌(Rajasingh) హాట్ కామెంట్స్ చేశారు.

ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోలో, 'టీజర్ విడుదలైన తర్వాత, వివిధ వ్యక్తులు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సెన్సార్ బోర్డు దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ ట్వీట్ చేశారు. 'నిజాం హయాంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎంతమందిని చంపాడో మీ నాన్న చెప్పలేదు' అని కేటీఆర్‌తో చెప్పాలనుకుంటున్నాను. మేము ఇద్దరం ముందుగా సినిమా చూసి, ఆ తర్వాత నిషేధాన్ని కొనసాగించాలా లేక హిందువులపై రజాకార్లు చేసిన అకృత్యాల గురించి ప్రజలకు తెలియజేయాలా అని నిర్ణయించుకోవాలని నేను ప్రతిపాదిస్తున్నాను' అని రాజాసింగ్‌ ఫైర్ అయ్యారు.

కేటీఆర్‌ ఏం అన్నారు?
రజాకార్ సినిమా టీజర్ విడుదలైన తర్వాత కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా విషయాన్ని సెన్సార్ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పారు. బీజేపీకి చెందిన కొంతమంది దివాళా తీసిన వ్యక్తులు తెలంగాణలో తమ రాజకీయ ఎజెండా కోసం మత హింసను ప్రేరేపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు ఈ విషయాన్ని తెలంగాణ పోలీసుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.

ALSO READ: రజాకార్లపై పోరాటానికి ముందు పాక్‌ ప్రధానికి నెహ్రు టెలిగ్రామ్‌.. నిజాం పీడ వదిలిన రోజు!

రజాకార్లు ఎవరు?
నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో జాతీయవాద పార్టీ పారామిలిటరీ వాలంటీర్ దళం రజాకార్లు. 1938లో మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడు బహదూర్ యార్ జంగ్చే స్థాపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఖాసిం రజ్వీ నాయకత్వంలో ఈ దళం విస్తరించింది. ఒక మతం టార్గెట్‌గా రజాకార్లు దారుణాలకు పాల్పడ్డారని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు ఇదే అంశాలను హైలెట్ చేస్తూ 'రజాకార్' సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన తర్వాత, ఖాసిం రజ్వీ మొదట్లో జైలు పాలయ్యాడు. తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లాడు. రజాకార్లు ఒకప్పటి హైదరాబాద్‌ ప్రజలపై చేసిన దౌర్జన్యాలను వెలుగులోకి తీసుకురావడం ఈ సినిమా లక్ష్యంగా తెలుస్తోంది. బీజేపీ నేత గూడురు నారాయణ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాట సత్యనారాయణ దర్శకత్వంలో రజాకార్ సినిమా రాబోతున్నారు.

ALSO READ: బాలీవుడ్ బాద్షా పవర్ ఫుల్ కంబ్యాక్…2వేల కోట్ల కలెక్షన్

Advertisment
Advertisment
తాజా కథనాలు